Ticker

6/recent/ticker-posts

Ad Code

Telangana లోని రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం !


హైదరాబాద్‌, జనవరి 25, ఇయ్యాల తెలంగాణ  : తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 12 వేలు ఇస్తామని రేవంత్‌ సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖరీఫ్‌, రబీ రెండు విడతలుగా ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి విడతగా.. ఈనెల 26న రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తామని సర్కార్‌ ఇది వరకే స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు సాగు భూముల లెక్కలు తేల్చారు.రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్‌ కు ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం రూ.8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు, హైవేలు ఇతర ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకున్న భూముల వివరాలను గుర్తించారు. ఇటువంటి భూములు దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో సాగుకు యోగ్యం కాని భూముల సర్వే నెంబర్లను ఆన్లైన్లో బ్లాక్‌ చేస్తున్నారు. సాగులో లేని భూములను మినహాయించి మిగిలిన భూములకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించనున్నారు.రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూములన్నాయి.  69 లక్షల మంది రైతులు పట్టాదారులుగా ఉన్నారు. 

అయితే ఇందులో కొన్ని సాగులో  లేని భూములున్నాయి. పట్టాలున్నా.. వాటిల్లో పంటలు వేయటం లేదు. పంక్షన్‌ హాల్స్‌, పెట్రోల్‌ బంకులు, హోటల్స్‌, పార్కింగ్‌ స్థలాలు వంటివి ఏర్పాటు చేసి ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయూ భూములను గుర్తించిన అధికారులు.. వాటికి రైతు భరోసా సాయం ఇవ్వొద్దని డిసైడ్‌ అయ్యారు. ప్రాథమికంగా తేలిన లెక్కల ప్రకారం 3 లక్షల ఎకరాలు సాగుకు పనికి రానివని గుర్తించారు. అవిపోగా.. మిగిలిన కోటి 49 లక్షల ఎకరాల భూములకు రైతు భరోసా అందించనున్నారు.రైతు భరోసా పథకం అమలుకు మె?త్తం రూ.8900 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఈసారి దఫా ఎకరాకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్‌ రైతు భరోసా పంట పెట్టుబడి పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు ఎకరా నుంచి మె?దలుపెట్టి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు సర్కార్‌ సిద్ధమైంది.

1.49 కోట్ల ఎకరాలకు భరోసా..

సాగుకు అనుకూలమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో గత వానాకాలం సాగు చేసిన భూముల వివరాలను వ్యవసాయ శాక   నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దీని ఆధారంగానే రైతు భరోసా చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు జనవరి 26న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే అవకావం ఉందని సమాచారం. ఈమేరకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.

3 లక్షల ఎకరాలకు రాదు..

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం సాగు యోగ్యం కాని గుట్టలు, కొండలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు సేకరించింది. ఇలాంటి భూములు 3 లక్షల ఎకరాలు ఉన్నట్లు తేలింది. వాటి సర్వే నంబర్లను కూడా అధికారుల బ్లాక్‌ చేశారు. మిగిలిన 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కోసం రూ.8,800 కోట్లు అవసరమని ప్రభుత్వం నిర్ధారించింది. ఈమేరు నిధులు సేకరించే పనిలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది.

మార్గదర్శకాలు ఇవీ..

👉 రైతు భరోసా కింద సాగు యోగ్యమైన వ్యవసాయ భూమికి ఏటా రూ.12 వేలు చెల్లిస్తుంది.

👉 సాగు యోగ్యమైన భూమిలో పంటలు వేసినా వేయకపోయినా రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందకు ధరణి, భూమాత పోర్టల్‌లో నమోదైన ఖాతాల ఆధారంగా చెల్లిస్తారు.

👉 ఆర్వోఎఫ్‌ఆర్‌పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులే.

👉 ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

👉 ఎన్‌ఐసీ హైదరాబాద్‌ భాగస్వామిగా రైతు భరోసా ఆపరేషన్స్‌ను నిర్వహిస్తారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు