Ticker

6/recent/ticker-posts

Ad Code

కొండెక్కుతున్న చదువులు ! దేశ విద్యావ్యవస్థ షాకింగ్‌ Report


న్యూ ఢిల్లీ, జనవరి 25 ఇయ్యాల తెలంగాణ :  
దేశ విద్యావ్యవస్థకు సంబంధించి ఒక షాకింగ్‌ రిపోర్ట్‌ బయటకు వచ్చింది. విద్యా మంత్రిత్వ శాఖ యూడైస్‌ ప్లస్‌ నివేదిక 2023`24 పాఠశాలల కొరతను భారీగా నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అడ్మిషన్ల సంఖ్య 37 లక్షల తగ్గుదల ఉంది. 2023`24 సంవత్సరంలో ఇంత తగ్గుదల సంభవించినప్పుడు ఏ సంవత్సరంలో గరిష్ట ప్రవేశాలు జరిగాయి. అసలు ఈ సారి ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో అడ్మిషన్లు తగ్గాయో చూద్దాందేశంలో విద్యార్థుల సంఖ్య తగ్గడం విద్యా రంగానికి పెద్ద సవాలుగా మారుతోంది. యూడైస్‌ ప్లస్స్‌ నివేదిక 2023`24 నివేదిక వివిధ సామాజిక, ఆర్థిక కారణాలను హైలైట్‌ చేసింది. డేటా ప్రకారం, 2022`23లో విద్యార్థుల సంఖ్య 25.17 కోట్లుగా ఉండగా, 2023`24 నాటికి అది 24.80 కోట్లకు తగ్గింది. అంటే ఒక సంవత్సరంలో పాఠశాలల్లో ప్రవేశం పొందే విద్యార్థుల సంఖ్య 37 లక్షలు తగ్గింది.గణాంకాల ప్రకారం, పాఠశాలల్లో ప్రవేశం పొందే బాలురు, బాలికల సంఖ్య తక్కువగా ఉంది. నివేదిక ప్రకారం, 2023`24లో అడ్మిషన్‌ తీసుకునే విద్యార్థులలో 21 లక్షల మంది అబ్బాయిలు, 16 లక్షల మంది అమ్మాయిలు తగ్గారు. అందులో మైనారిటీ విద్యార్థులు దాదాపు 20 శాతం, ఇందులో 79.6 శాతం ముస్లింలు, 10 శాతం క్రైస్తవులు, 6.9 శాతం సిక్కులు, 2.2 శాతం బౌద్ధులు, 1.3 శాతం జైనులు, 0.1 శాతం పార్సీలు ఉన్నారు.2023 సంవత్సరం నివేదిక విద్యార్థుల ప్రవేశం పరంగా మెరుగ్గా ఉంది. ఆ సంవత్సరం నివేదిక ప్రకారం భారతీయ గ్రామాల్లో 98.4శాతం మంది పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. 2018లో ఈ సంఖ్య 97.2శాతం. ఆ సంవత్సరం నివేదిక ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశం పొందే విద్యార్థుల సంఖ్య తగ్గింది. అదే సమయంలో, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెరిగింది.కరోనా మహమ్మారి సమయంలో విద్య నాణ్యత క్షీణించిందని నివేదికలు సూచిస్తున్నాయి. వార్షిక విద్యా స్థితి నివేదిక 2022 ప్రకారం, ఆ సమయంలో ప్రైవేట్‌ , ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 31శాతం మంది పిల్లలు ప్రైవేట్‌ ట్యూషన్‌పై ఆధారపడి ఉన్నారు. ఈ విషయంలో బీహార్‌ ముందంజలో ఉంది, ఇక్కడ 71.5శాతం, పశ్చిమ బెంగాల్‌లో 74శాతం మంది పిల్లలు ట్యూషన్‌పై ఆధారపడి ఉన్నారు. అయితే, ఈ గణాంకాలు ఆ సమయంలో 616 జిల్లాల్లోని 19,060 గ్రామాల్లో 7 లక్షల మంది పిల్లలపై నిర్వహించిన సర్వే ఫలితాలు ఇవి.విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్‌ 16 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో 8వ తరగతి వరకు ఏ విద్యార్థినీ కూడా అదే తరగతిలో మళ్ళీ కొనసాగించేందుకు లేదా పాఠశాల నుంచి తొలగించేందుకు వీలులేదు. దీనినే నో డిటెన్షన్‌ విధానం అంటారు. 


పరీక్షలలో ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా విద్యార్థులు పై తరగతులకు వెడతారు. ప్రాథమిక స్థాయిలో పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడం, ఆహ్లాదకరమైన అభ్యసనం, పరీక్షల పట్ల భయం తగ్గించడం, డ్రాప్‌ ఔట్స్‌ కాకుండా చూడటం నో డిటెన్షన్‌ పాలసీ ప్రధాన లక్ష్యాలు.అయితే ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే, అసెర్‌ నివేదికలు తేలుస్తున్నాయి. విద్యార్థులలో అభ్యసన పట్ల శ్రద్ధ తగ్గిందని, ఫలితాలకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు బోధనపై దృష్టి సారించడం లేదని విమర్శకుల వాదన. అదే విధంగా 9, 10 తరగతుల్లో డ్రాప్‌ ఔట్స్‌ అధికం అవుతున్నాయని వీరి విమర్శ. ప్రాథమిక స్థాయిలో 100 శాతం ఎన్‌రోల్‌మెంట్‌ ఉండగా, 9, 10 తరగతుల్లో డ్రాప్‌ ఔట్‌ శాతం 17గా ఉండటం గమనార్హం.నో డిటెన్షన్‌ విధానం వల్ల అభ్యసన సామర్థ్యాలు తగ్గుతున్నాయని, దానిని మార్చవలసిందిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విజ్ఞప్తులు అందాయి. దేశంలో 23 రాష్ట్రాలు డిటెన్షన్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించాయి. 2018లో విద్యా హక్కు చట్టానికి సవరణలు తెచ్చాక 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిటెన్షన్‌ విధానం అమలులోకి వచ్చింది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలు నో డిటెన్షన్‌ విధానమే కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఏ నిర్ణయమూ తీసుకోలేదు.నూతన విధానం ప్రకారం 5, 8వ తరగతి విద్యార్థులు సంవత్సరాంతంలో నిర్వహించే పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి. ఉత్తీర్ణత సాధించని వారికి రెండు నెలల పాటు శిక్షణ అందించి, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రెండవసారి కూడా ఉత్తీర్ణత సాధించకుంటే అదే తరగతిలో కొనసాగిస్తారు. అదే తరగతిలో కొనసాగించినపుడు విద్యార్థి అభ్యసన లోపాలు గమనించి వాటిని పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలి. 8వ తరగతి పూర్తి చేయకుండా ఏ విద్యార్థినీ బడిలో నుంచి తొలగించరాదని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొంది. అందరికీ విద్య అందాలి, కానీ అదే సమయంలో విద్యార్థులు ఆశించిన సామర్థ్యాలు పొందేందుకు నూతన విధానం దోహదపడుతుందని, అభ్యసనలో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రం వాదన.కానీ డిటెన్షన్‌ విధానం తిరోగాత్మక చర్యగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రాథమిక విద్యకు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యాహక్కు చట్టం ఉద్యమకారులు వాదిస్తున్నారు. డిటెన్షన్‌ విధానం వల్ల పిల్లల్లో పరీక్షల పట్ల భయం పెరిగే అవకాశం ఉంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులు బడికి దూరమయ్యే ప్రమాదం ఉంది. వారిలో న్యూనతాభావం ఏర్పడుతుంది. మళ్ళీ అదే తరగతి చదవాల్సి రావటం వారిలో నిరాసక్తతను పెంచుతుంది. బాలకార్మికులు పెరిగే ప్రమాదం ఉంది. డిటెన్షన్‌ను అధిగమించేందుకు పరీక్షలలో అనైతిక విధానాలకు పాల్పడే అవకాశం ఉంది. ప్రాథమిక స్థాయిలో ఆహ్లాదంగా జరగాల్సిన అభ్యసనం ఆందోళనాయుతంగా ఉంటుంది. డిటెన్షన్‌ విద్యావిధానం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై, మొదటి తరం అభ్యాసకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణుల అభిప్రాయం.నో డిటెన్షన్‌ విధానంలో ఉన్న లోపాలను అధిగమించేందుకు విద్యావ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావాలి. విద్యార్థుల అభ్యసనం, ఉపాధ్యాయుల బోధన అభివృద్ధిచెందేందుకు పర్యవేక్షణ ఉండాలి. అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావాలి. నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించకుండా, డిటెన్షన్‌ ద్వారా అవరోధాలు సృష్టించడం వారిని శాశ్వతంగా విద్యకు దూరం చేస్తుంది. అందుకని డిటెన్షన్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసవిూక్షించాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు