Ticker

6/recent/ticker-posts

Ad Code

నేడు స్వతంత్ర సమరయోధుడు, Punjab కేసరి లాలా లజపత్‌ రాయ్‌ జయంతి


 లాలా లజపత్‌ రాయ్‌ భారత్‌ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు. పంజాబ్‌ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో  జనవరి 28, 1865 జన్మించి , నవంబరు 17, 1928న బ్రిటిష్‌ వారి దాడి కారణంగా చికిత్స పొందుతూ మరణించారు. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్‌ రాజ్కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు పంజాబ్‌ కేసరి అనే బిరుదును ఇచ్చారు. ఇతను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మరియు లక్ష్మి ఇన్సూరెన్స్‌ కంపెనీల స్థాపకుడు.

లాల్‌ (లాలా లజపత్‌ రాయ్‌), బాల్‌ (బాలగంగాధర తిలక్‌), పాల్‌ (బిపిన్‌ చంద్రపాల్‌) త్రయం, ఆకాలంలో లాల్‌`బాల్‌`పాల్‌ గా ప్రసిద్ధి. వీరిలో ఆయన ఒకడు. 1928 లో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్‌ విచారణ సంగము (సైమన్‌ కమిషన్‌ ) ను వ్యతిరేకించుతు లలా లజపతిరాయి చేసిన ఆందోళన బ్రిటిష్‌ ఇండియా చరిత్రలో చాల ప్రముఖమైనది. 1920`30 దశాబ్దములో జాతీయకాంగ్రెస్సు వారి మెత్తదనపు మితవాద సిద్దాంతమును విడనాడి తీవ్రజాతీయవాదు లలో లాలా లజపతిరాయి ప్రముఖుడు. లాలాలజపతిరాయ్‌ మరణాంతరం బ్రిటీష్‌ వారిని ఎలాగైన దెబ్బతీయాలని నిర్ణయించుకున్న భగత్‌ సింగ్‌ ఆ ప్రతీకారేచ్ఛతోనే భగత్‌ సింగ్‌ బృందం స్క్యాట్‌ అనుకుని శాండర్స్‌ అనే అధికారిని హత్య చేశారు. ఆయన స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమం మరింత ఉధృతమై కొన్నేళ్లకు దేశాన్ని వదిలి బ్రిటీష్‌ పాలకులు వెళ్లకతప్పలేదు. ‘‘నేను మరణించవచ్చు కానీ.. నానుండి వెలువడే ప్రతీ నెత్తురు చుక్క నుంచి లక్షలాది స్వాతంత్ర సమరయోధులు ఉద్భవిస్తారు’’ అన్న లాలాజీ మాటలు అక్షర సత్యాలయ్యాయి.

.....

పెండ్యాల రామ్‌ కుమార్‌, మంథని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు