హైదరాబాద్, జనవరి 12 (
ఇయ్యాల తెలంగాణ) : శ్రీ జగద్గురు సంతు శిరోమణి గురు రవిదాస్ జీ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా అఖిల భారతీయ రవి దాసీయ ధార్మిక సంఘటన సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీన జరిగే శ్రీ జగద్గురు సంత్ శిరోమణి గురు రవి దాస్ జి మహారాజ్ గ జయంతిని సందర్బంగా నిర్వాహకులు చలో కాశీ క్షేత్ర పర్యటనకు రైలు బోగీని కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ రవిదాసియా ధార్మిక సంఘటన సమన్వయ కమిటీ ప్రచారక్ కమిటీ ప్రెసిడెంట్ ఆకేపోగు ప్రమోద్ మహారాజ్,సామాజిక వేత సిరాపు రామ్ చందర్, తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ శివకుమార్, మహారాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సంబవాగే మారే, ప్రొఫెసర్ కిషోర్ వాంఖేడే, ఆనంద్ తమ్లుక్కర్, సంజీవ్ రావు , శ్యామ్ టాక్, పాల్గొన్నారు
0 కామెంట్‌లు