Ticker

6/recent/ticker-posts

Ad Code

PM మోదీ ఆలోచనలకు అనుగుణంగా మారుతున్న గుజరాత్‌ రూపురేఖలు !


గాంధీనగర్‌, జనవరి 25, (ఇయ్యాల తెలంగాణ) : బహుళ జోన్‌లు ఉన్నాయి. బ్లాక్‌ 1: గేమ్స్‌ జోన్‌ , బ్లాక్‌ 2: అంకితమైన పికిల్‌ బాల్‌ కోర్టు, బ్లాక్‌ 3: బాక్స్‌ క్రికెట్‌ సౌకర్యాలు, బ్లాక్‌ 4: బాస్కెట్‌బాల్‌ కోర్టు, బ్లాక్‌ 5: ఫుడ్‌ జోన్‌, అలాగే రెండు పార్కింగ్‌ బ్లాక్‌లు ఏర్పాటు చేసింది అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌. అహ్మదాబాద్‌లో మరో 10, సూరత్‌లో 2, వడోదరలో 4, రాజ్‌కోట్‌లో 2 మరియు గాంధీనగర్‌ మహానగర్‌ పాలికాలోని 2 వంతెనలను ఈ చొరవ కింద ఇదే విధంగా మార్చనున్నారు. పట్టణ స్థలాల సామర్థ్యాన్ని పెంచాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిడ్జి కింద నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలను క్రీడా కేంద్రాలుగా మార్చాలని ప్రధానిమోదీ సూచించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు గుజరాత్‌ ప్రభుత్వం వంతెనల కింద ఉపయోగించని ప్రాంతాలను క్రీడా కేంద్రాలుగా మారుస్తోంది. ప్రజా స్థలాలను పునరుజ్జీవింప జేయడానికి, ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు, సంస్కృతిని పెంపొందించడానికి గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఇటీవల గుజరాత్‌ పర్యటనలో, ప్రధాని మోదీ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిల కింద ప్రాంతాన్ని సముచితంగా ఉపయోగించుకోవాలని గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చూసించారు. తద్వారా యువత క్రీడలలో పాల్గొనేందుకు, వృద్ధులు తమ సమయాన్ని గడిపేందుకు, ఆహార దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఎలాగే ఎందరికో ఉపాధి లభిస్తుంది.కొన్ని బ్లాక్‌లను పార్కింగ్‌ కోసం కేటాయించాలని, స్టాళ్ల ద్వారా స్థానిక ఆహారాన్ని ప్రోత్సహించాలని గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

కొన్ని బ్లాక్‌లను పార్కింగ్‌ కోసం కేటాయించాలని, స్టాళ్ల ద్వారా స్థానిక ఆహారాన్ని ప్రోత్సహించాలని గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఏర్పాటు చేసే స్టాళ్లలో స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు ఎక్కువ ఉపాధి కల్పించాలని ప్రధాని మోదీ సూచించారు. పిల్లలు క్రీడలలో పాల్గొనడానికి, మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉండటానికి ఈ సౌకర్యాలు సహాయ పడాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా అండర్‌బ్రిడ్జ్‌ స్థలాలను శక్తివంతమైన క్రీడా కేంద్రాలుగా మార్చేంది అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌. ఖాళీ స్థలాలను వినూత్న అవసరాలకు ఉపయోగించారు. అహ్మదాబాద్‌లోని నార్త్‌`వెస్ట్‌ జోన్‌లోని గోటా వార్డ్‌లోని సిఐఎంఎస్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద హోంమంత్రి అమిత్‌ షా అలాంటి ఒక సదుపాయాన్ని ప్రారంభించారు. అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ రూ. 3.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన నార్త్‌`వెస్ట్‌ జోన్‌లోని గోటా వార్డ్‌లోని సిఐఎంఎస్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ సైన్స్‌ సిటీ వైపు కొత్తగా నిర్మించిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. అనంతరం ప్రముఖులు క్రీడా ప్రాంగణంలో వివిధ విభాగాలను సందర్శించారు. అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇస్కాన్‌ నుండి పక్వాన్‌ వరకు విస్తరించి ఉన్న రాబోయే ప్రతిష్టాత్మక రహదారి ప్రాజెక్ట్‌పై ప్రదర్శనను కేంద్ర హోం మంత్రి పరిశీలించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు