హైదరాబాద్, జనవరి 11, (
ఇయ్యాల తెలంగాణ) : సంప్రదాయం, ఆనందాల సమ్మేళనమే సంక్రాంతి పండుగ. బిజీ షెడ్యూల్ ను పక్కనబెట్టి సొంతూళ్లకు పయనవుతోన్న హైదరాబాద్ ఇప్పుడు సంక్రాంతి పండుగకు సిద్ధమవుతోంది. అప్పుడే పిండి వంటలు చేయడం మొదలైంది. విద్యాసంస్థలకు ప్రకటించడంతో సంక్రాంతి సెలవుల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొందరేమో ఎప్పుడెప్పుడు తమ సొంతూళ్లకు లేదా అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లాలా అని ఆలోచిస్తూ కూర్చున్నారు. నగరాన్ని కనువిందు చేసేలా ఇప్పటికే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆకాశంలో పతంగులను ఎగురవేస్తూ ఆనందిస్తున్నారు. ఇక మార్కెట్లు సైతం ఈ పండక్కి జనంతో కిటకిటలాడుతున్నాయి. అయితే జనరేషన్ కి తగ్గట్టుగా మార్కెట్లో పతంగులు అందుబాటులో ఉంటున్నాయి. సినిమా హీరోలు, యానిమేషన్స్ లాంటివి పిల్లలను ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ పండక్కి మరో ప్రత్యేకత ఏంటంటే.. హైదరాబాద్ లో జరిగే కైట్ ఫెస్టివల్. అందుకే హైదరాబాద్ మార్కెట్ ను ను అతిపెద్ద పతంగుల మార్కెట్ అని పిలుస్తూ ఉంటారు.పతంగుల పండుగ అని కూడా పిలుచుకునే ఈ సంక్రాంతి పండక్కి నగరంతో పాటు పలు జిల్లాలు, రాష్ట్రాల నుంచి విభిన్నమైన డిజైన్లలో పతంగులు హైదరాబాద్ కు చేరుకున్నాయి. అందులో ముఖ్యంగా చార్మినార్ వద్ద ఉండే గుల్జార్ హౌజ్ ఈ పతంగుల అమ్మకానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఈ ప్రాంతంతో పాటు మూసాబౌలి, బేగంబజార్, దూల్ పేట్, లాల్ దర్వాజా వంటి ప్రముఖ ప్రాంతాల్లోనూ గాలి పటాలు విస్తృతంగా అమ్ముడవుతాయి.
ఇక గుడుంబా అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే దూల్ పేట్ లో ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. ఇంతకుముందు గుడుంబా అమ్ముకునే వ్యాపారస్తులు ఇప్పుడు పతంగులు తయారు చేసి అమ్ముతున్నారు. ఈ వ్యాపారంలో తమకు అంతగా లాభాలు రాకపోయినప్పటికీ సమాజంలో గౌరవంగా బతుకగలుగుతున్నామని వారు చెబుతున్నారు. మరికొందరేమో ఆశించిన ఆదాయం రాకపోతుండడంతో వేరే పనులు చేసుకుంటున్నారని అంటున్నారు. ఏదైమైనా ముందుతో పోలిస్తే పతంగులు తయారు చేసే కుటుంబాలు బాగా తగ్గిపోయాయనే తెలుస్తోంది.పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించింది. దీంతో సంప్రదాయ లోకల్ మాంజాకు డిమాండ్ పెరిగింది. మూసీ నదీ తీర ప్రాంతంలోని మంగళ హట్ ఏరియాలో చాలా మంది మాంజా తయారుచేస్తుంటారు. లోకల్ మాంజాతో పాటు బరేలీ, కృష్ణ, గన్, సిక్స్ కాట్, 12 కాట్, నైన్ కాట్ అంటూ పలు రకాలు మాంజాలను వారు తయారు చేస్తారు. గ్లాస్ పౌడర్ తో తయారయ్యే మాంజా కోసం వారు దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేసి.. మార్కెట్ లో రూ.25 `38వేలకు అమ్ముతుంటారు. చైనా మాంజాతో తమకు గిరాకీ పెరుగుతోందని అక్కడి వ్యాపారులు చెబుతోన్న మాట.ప్లాస్టికేతర పతంగులకు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో.. చాలా మంది దీపావళి నుంచే పతంగులను తయారు చేయడం మొదలుపెట్టారు. స్థానికంగా తయారు చేయడమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పతంగులను తెచ్చి అమ్ముతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ పతంగులపై నిషేధం విధించడంతో వారంతా ఇక్కడే వచ్చి కొనుక్కుంటున్నారని, కానీ ఒక్క కుటుంబంలో కనీసం ముగ్గురు కష్టపడినా ఒక్క రోజులో 200 పతంగులకు మించి తయారు చేయలేకపోతున్నారు. ఒక్కో గాలి పటం తయారీకి దాదాపు రూ.30 `100 ఖర్చు చేస్తున్నప్పటికీ.. అమ్మకం దగ్గరికి వచ్చేసరికి మాత్రం పెట్టుబడికి లోపే ఉండడం తయారీదారులకు దురదృష్టంగా మారింది. ఇక గాలి పటాలతో ఆడే పిల్లలు కూడా చాలా తగ్గిపోయారు. ఏ మాత్రం ఖాళీ దొరికినా చదువు, ఫోన్లు, టీవీ అంటూ ఏదో ఒక ఆలాపనలో మునిగిపోతున్నారు. పతంగులతో ఆడుకునే టైం కూడా చాలా తక్కువైపోయింది.అయితే పతంగులను పేపర్, మెటల్, ప్లాస్టిక్ వంటి ఐటెమ్స్ తో తయారు చేస్తుంటారు.
కానీ ఈ సారి మార్కెట్ లోకి గోల్డ్, సిల్వర్ పతంగులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. బంగారం, వెండి పూతలతో తయారు చేసిన ఈ గాలిపటాలు ఒక గ్రామ్ గోల్డ్ కోటెట్ గిఫ్ట్ ప్యాక్ కి రూ.200`500, సిల్వర్ ప్యాక్ ధర రూ.850 వరకు అమ్ముతున్నారు. ఇవే కాకుండా జర్మన్ సిల్వర్, మెటల్ రైట్, సిల్వర్ చక్కి, సీసం ఫుడ్, జైపూర్ విూనా ఆర్ట్ వర్క్ తో కూడిన గిఫ్ట్ ప్యాక్స్ కూడా మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. డిజైన్, మన్నికను బట్టి వీటి ధర ఉంటోంది.అందరికీ ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగకు గాలిపటాలను ఎగురవేయడమనేది సంప్రదాయంగా వస్తోన్న ఆచారం. అందులో భాగంగానే ఏటా హైదరాబాద్ లో అంతర్జాతీయ పతంగుల పండుగను నిర్వహిస్తారు. ఇది ఈ నెల 13,14,15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనుంది. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకకు దాదాపు 11 దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సారి అమ్మాయిల చదువు ` ప్రపంచ మార్పుకు నాంది అనే థీమ్ తో ఈ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. దీంతో పాటు నగరంలో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా చెప్పుకోదగిన వేడుక.
0 కామెంట్‌లు