మనిషీ దేశం గురించి ఆలోచిస్తాడు
విద్రోహమైన చర్యలుకు పూనుతాడు
దేశభక్తీ తాకటు పేడతాడు !
మనిషీ ప్రేమ గురుంచి ఆలోచిస్తాడు
ద్వేషాన్ని ఆరాధిస్తాడు
ప్రేమని తృణికరిస్తాడు !
మనిషీ చేట్ల గురించి ఆలోచిస్తాడు
తరువులను నరికేస్తాడు
అడవులను లేకుండా చేస్తాడు !
మనిషీ బాధల గురించి ఆలోచిస్తాడు
బాధలలో బంధీ అవుతాడు
బంధువులను దూరం చేసుకుంటాడు !
మనిషీ కష్టాల గురించి ఆలోచిస్తాడు
వక్రమార్గం పడతాడు
సుఖాల వేటలో చేదరిపోతాడు !
మనిషీ దేవుడి గురించి ఆలోచిస్తాడు
శ్రమను మరుస్తాడు
దైవ దూషణ చేసేస్తాడు !
మనిషీ జీవితం గురించి ఆలోచిస్తాడు
వ్యసనాలలో మునుగుతాడు
జీవితాన్ని క్లిష్టం చేసుకుంటాడు !
మనిషీ దేని గురించి ఆలోచిస్తాడో
అక్కడే తప్పులు చేస్తాడు
సుఖఃదుఖాలకు పరులను నిందిస్తాడు !
మనిషీ అన్నింటా మంచికై ఆలోచిస్తాడు
కోన్ని మంచి పనులే ఆచరిస్తాడు !
0 కామెంట్‌లు