హైదరాబాద్,జనవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి అన్నారు. సెయింట్ పీటర్స్ హై స్కూల్ భోయిన్ పల్లి విద్యార్థిని అర్వి రెడ్డి , జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేందర్ రావ్ , గైడ్ టీచర్స్ నిషా సింగ్ ని ప్రతిభ కనబరచినందుకు కలెక్టర్ వారిని అభినందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని విద్యార్ధి దశ నుంచి ప్రోత్సాహం అందించాలని కోరారు. దీనికి సరైన ప్రోత్సాహం విద్యా శాఖనే తోడ్పాటును అందించగలుగుతున్నదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు పలు పాఠశాలలలకు సంబందించిన టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
0 కామెంట్లు