Ticker

6/recent/ticker-posts

Ad Code

అయ్యప్ప స్వాముల Bus బోల్తా - డ్రైవర్‌ మృతి.. పలువురికి గాయాలు


హైదరాబాద్‌, జనవరి 03 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ పాతబస్తీ మదన్న పేట ఉప్పర్‌ గూడా కి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడిరది. ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తున్న గురు స్వామి రాంపాల్‌ యాదవ్‌, అభి యాదవ్‌, రామ్‌ యాదవ్‌, పెద్ది యాదవ్‌ ల అద్వర్యంలో  వెళ్తున్న అయ్యప్ప స్వాములు బస్సు పంపా నది కి 15కిలోవిూటర్ల దూరం లోని ఘాట్‌ రోడ్డులో బోల్తా పడిరది.. ఘాట్‌ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు మూడు చెట్ల పై ఒరగడం తో  పెద్ద ప్రమాదం తప్పింది . బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్‌ కాలేజి ఆసుపత్రికి తరలించారు తీవ్రగాయాలు పాలైన డ్రైవర్‌ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అయ్యప్ప స్వాములు అందరూ స్వల్పగాయలతో బయటపడ్డారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు