Ticker

6/recent/ticker-posts

Ad Code

ఆరోగ్య శాఖ మంత్రిని కలసిన బుంగ శివకుమార్


హైదరాబాద్, జనవరి 1 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజ నర్సింహను గురువారం తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ శివకుమార్ మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్ లో కలుసుకొని శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మనిషా అనే అమ్మాయి సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మనిషా అనే అమ్మాయి (ఎంబిబిఎస్) ప్రీ సీటు లభించింది. సిద్దిపేట మెడికల్ కాలేజీలో మనీషకు సీటు లభించినది.  దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి వాళ్ళ  అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నారు. కాలేజీలో మెడికల్ సీటు కోసం ఏ రోజు అయితే రిపోర్ట్ చేయవలసి ఉన్నదో ఒక్కరోజు ముందు రాత్రికి వాళ్ళ అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఫ్రీ సీటు లభించినా మనీష కాలేజీలో రిపోర్ట్ చేయలేక పోయింది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ అమ్మాయికి కాలేజీలో సీటును బ్లాక్ లిస్టులో పెట్టేసి పనిష్మెంట్ కింద తెలంగాణలో  మూడు సంవత్సరాల దాకా ఎక్కడ మెడికల్ చదవకుండా బ్లాక్ చేయడం జరిగింది. 

ఇదే విషయమై బుంగ శివకుమార్ దయార్థ సహృదయంతో మనీష విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు మనీష ఇంట్లో జరిగిన సంఘటనంపై తగిన న్యాయం చేయాలని, ఇప్పటికే మరోసారి నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న అమ్మాయి ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగినందుకు బ్లాక్ లిస్టులో నుంచి అమ్మాయి పేరును తొలగిస్తే మళ్ళీ పాస్ అయి (ఎంబిబిఎస్) సీటు సాధిస్తానని మంత్రి సమక్షంలో తెలియజేసింది. తనపై మానవతా దృక్పతంతో దయ తలచి నాకు మరో అవకాశం కల్పించాలని  మనీష మంత్రిగారిని కోరడం జరిగింది. మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తప్పక చేద్దాం మని హామీ ఇవ్వడంతో  పాటు రెండు రోజుల తర్వాత వచ్చి కలవవలసిందిగా మనీష కు ధైర్యం చెప్పి పంపించారు. మనీష విషయంలో సానుకూలంగా స్పందించిన ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజా నర్సింహా గారికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ శివకుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు