Ticker

6/recent/ticker-posts

Ad Code

Begumpet లోని చిరు వ్యాపారులను ఆదుకోవాలని మంత్రికి వినతి !


హైదరాబాద్, జనవరి 4 (ఇయ్యాల తెలంగాణ) :  రోజు వారి వ్యాపారాలతో తోపుడు బండ్లపై చిన్న, చితక వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులను ఇబ్బందుల పాలు కాకుండా తగిన  తోడ్పాటు నందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహను  స్థానిక సంఘం నాయకులు మల్లెల కిరణ్ కుమార్ మాదిగ కోరారు.  ఈ సందర్బంగా మంత్రి గారిని మినిష్టర్ క్వార్టర్స్ లో కలసి బేగంపేటలోని మంత్రి దామోదర రాజనర్సింహ గారి ఇంటి సమీప ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న టీ స్టాల్, టిఫిన్ సెంటర్ లాంటి వ్యాపారుల సమస్యలను మంత్రికి వివరించారు. GHMC  మరియు  TRAFFIQ పోలీస్ అధికారులు వ్యాపారాలను తొలగిస్తున్న విషయాన్నీ మంత్రికి తెలియజేశారు. చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారుల విషయంలో సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహా చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచించారు. 


చిన్న చిన్న వ్యాపారాలతో జీవనాన్ని సాగిస్తున్న పేద వ్యాపారులను ఇబ్బందుల పాలు చేయవద్దని మంత్రి అధికారులకు చెప్పారు. ఎళ్ల తరబడి ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని ఆదుకోవాలని స్థానిక బస్తీవాసులు మంత్రికి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల కిరణ్ కుమార్ మాదిగ , కార్తీక్ గౌడ్, సంతోష్, రాణి,కళ్యాణి రాజేష్ గౌడ్, కిరణ్ రాహుల్, మల్లెల వినోద్, ప్రవీణ్  తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు