`నేడు ఆయన వర్ధంతి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర సమరయోధులు కర్నె వెంకట కేశవులు. ఈయన రాజకీయ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జౌలి శాఖ సహకార మంత్రిగా పని చేశాడు. కె.వి.కేశవులు 1924 జనవరి 14న తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో జన్మించాడు. ఆయన విద్యామస్యమంతా ధర్మపురిలో పూర్తి చేశాడు.
కె.వి.కేశవులు భారత స్వతంత్ర ఉద్యమంలో కీలకంగా పని చేస్తూ ఆంద్రప్రదేశ్ స్వాతంత్ర సమరయోధుల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా పని చేశాడు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక హైదరాబాద్ (నైజాం) సంస్థానం భారతదేశంలో కలవలేదు. ఆయన నిజాం నిరంకుశపాలన గురించి ప్రజలను చైతన్య వంతులను చేయడం, వారి అరాచకాలను మొండిగా ఎదిరించి జాతీయ పతాకాన్ని రెప రెప లాడిరచి, నాటకాలు, సాహిత్యాలతో ప్రజలను కార్మోకులను చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశం ప్రభుత్వ పాలనలో విలీనమైన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
కె.వి.కేశవులు 1972, 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జౌళి శాఖ సహకార మంత్రిగా పని చేశాడు.
30 జనవరి 2019లో వృద్ధాప్య కారణాలతో హైదరాబాద్ లో మృతి చెందారు.
0 కామెంట్లు