Ticker

6/recent/ticker-posts

Ad Code

TRTF హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా డా . శ్రీవాటి శ్రీనాథ్

హైదరాబాద్, డిసెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) హైద్రాబాద్ జిల్లా అధ్యక్షులుగా  డా . శ్రీవాటి శ్రీనాథ్ నియమితులయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా డా. ఎస్. విజయ భాస్కర్, గౌరవ అధ్యక్షులుగా యాదగిరి చారిలు నియమితులయ్యారు. ఈ మేరకు టీ ఆర్ టి ఎఫ్ రాష్ట్ర శాఖా అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజి రెడ్డి లు నియామక పత్రాన్ని విడుదల చేశారు. నూతనంగా నియమితులైన హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డా. శ్రీవాటి శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. విజయ భాస్కర్ లు మాట్లాడుతూ తమను గుర్తించి భాధ్యతను అందజేసిన టీ ఆర్ టి ఎఫ్ కు విశిష్ట సేవలందిస్తామని, ఉపాధ్యాయుల హక్కుల వారి సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. సమగ్ర శిక్ష, కస్తూర్బా ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వడమే కాకుండా వారందరిని రెగ్యులర్ చేయాలని ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వారి న్యాయమైన సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారు చేస్తున్న సమ్మెను వీరంపజేసేలా కృషి చేయాలనీ పేర్కొన్నారు. భాష పండితులను అప్గ్రేడేషన్ చేసి పదోన్నతులు, బదిలీలు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మిగిలిన కొద్దిమంది భాష పండితుల పోస్టులను సైతం  నవీకరణ (అప్ డేట్) చేసి పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

అభినందన జల్లు : 

టీ ఆర్ టి ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా  నియమితులైన డా . శ్రీవాటి శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శి డా.  ఎస్. విజయ భాస్కర్ ను పలువురు ఉపాధ్యాయులు అభినందనలు అందజేశారు. వివిధ పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు అభినందనలు అందజేశారు. జిల్లా అధ్యక్షులుగా  నియమితులైన డా . శ్రీవాటి శ్రీనాథ్ ప్రస్తుతం మీరాలం పెట్ల బుర్జు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా  ప్రధాన కార్యదర్శి డా.  ఎస్. విజయ భాస్కర్ గౌలిపురా లలితా బాగ్ రోడ్ లోని శాలిబండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు