Ticker

6/recent/ticker-posts

Ad Code

నేడు అంతర్జాతీయ Tea (తేనీటి) దినోత్సవం !

 


అంతర్జాతీయ చాయ్‌ దినోత్సవం (అంతర్జాతీయ తేనీటి దినోత్సవం) ప్రతి ఏట డిసెంబర్‌ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. తేనీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం ఏర్పాటుచేయబడిరది. టీ మొట్టమొదటిసారిగా చైనాలో తయారుచేశారు. 4వ శతాబ్దంలో ఒక చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడిచేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్యపరీక్ష కోసం త్రాగాడు. ఆ డికాక్షను త్రాగినందువల్ల అతడు ఉత్తేజాన్ని పొందాడు. అలా 15 శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. ప్రపంచవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి. ప్రతి సంవత్సరం డిసెంబరు 15న అంతర్జాతీయ చాయ్‌ దినోత్సవం జరుపుకుంటారు. మొదటి అంతర్జాతీయ చాయ్‌ దినోత్సవం 2005, డిసెంబరు 15న న్యూఢల్లీిలో జరిగింది.రెండవ అంతర్జాతీయ దినోత్సవం 2006, డిసెంబరు 15న శ్రీలంకలో జరిగింది. టీ ఉత్పత్తి చేస్తున్న భారతదేశం, బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, ఇండోనేషియా, కెన్యా, మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి దేశాలలో 2005 నుండి ఈ దినోత్సవం జరుపుకుంటారు. 

                                                                                      --  ( పెండ్యాల రామ్‌ కుమార్‌, మంథని )

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు