చాంద్రాయణ గుట్ట, డిసెంబర్ 23 (ఇయ్యాల తెలంగాణ) : చాంద్రాయణ గుట్ట నియోజక వర్గం ఛత్రినాక పోలీస్ స్టేషన్ SHO గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వర్మ గారిని SC డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్ కలసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వర్మను ఆయన శాలువాతో సత్కరించారు. చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలో మొదటి సారి బండ్లగూడ SHO గా, రెండవసారి ఛత్రినాక ఇన్ స్పెక్టర్ గా వర్మ గారు భాద్యతలు చేపట్టడం అందరికీ గర్వ కారణమని నరేష్ అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరి రక్షించడంలో వర్మ గారు నిష్ణాతులని గుర్తు చేశారు.
0 కామెంట్‌లు