Ticker

6/recent/ticker-posts

Ad Code

కృష్ణవేణి టాలెంట్ School లో సైన్సు ఎక్సిబిషన్ !


హైదరాబాద్, డిసెంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ) : ఛత్రినాకలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం సైన్సు ఎక్సిబిషన్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు పలు రకాల ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్సు ఎక్సిబిషన్ తోడ్పాటు నందిస్తాయని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ మంజుల నీలం అన్నారు. పలువురు విద్యార్థులు తమ ప్రతిభతో కొత్త కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సైన్సు ఎక్సిబిషన్ లో ఉంచారు. పాఠశాలలోని అన్ని తరగతి గదుల్లో సైన్సు ఎక్స్ పో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గౌతమ్ సర్ తో పాటు ఇతర టీచర్లు విద్యార్థులు వారి తల్లి దండ్రులు పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు