Ticker

6/recent/ticker-posts

Ad Code

March 5 నుంచి Inter ఎగ్జామ్స్‌ - ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు !


హైదరాబాద్‌, డిసెంబర్‌ 17, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్మీడియట్‌ బోర్డు  విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్షను జనవరి 29న నిర్వహించనున్నారు. ఇక జనవరి 30న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్ష జనవరి 31న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. ఇందులో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 5 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్నారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 19తో ముగియనుండగా.. ఫస్టియర్‌ ఒకేషనల్‌, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 24తో ముగుస్తున్నాయి.  అదేవిధంగా మార్చి 6 నుంచి మార్చి 25 వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సెకండియర్‌ ప్రధాన పరీక్షలు మార్చి 20తో ముగియనుండగా.. ఒకేషనల్‌, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 25తో ముగుస్తున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు..

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్‌ కూడా ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జనరల్‌, ఒకేషనల్‌ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.  

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ వారం పేపర్‌

👉 05.03.2025 బుధవారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌`1

👉 07.03.2025 శుక్రవారం ఇంగ్లిష్‌ పేపర్‌ పేపర్‌`1

👉 11.03.2025 మంగళవారం మాథ్స్‌ పేపర్‌ 1ఎ, బోటని పేపర్‌`1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌`1

👉 13.03.2025 గురువారం మ్యాథ్స్‌ పేపర్‌ 1బి, జువాలజి పేపర్‌`1, హిస్టరీ పేపర్‌`1

👉 17.03.2025 సోమవారం ఫిజిక్స్‌ , ఎకనామిక్స్‌

👉 19.03.2025 బుధవారం కెమిస్ట్రీ , కామర్స్‌

👉 21.03.2025 శుక్రవారం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌`1, బ్రిడ్జ్‌ కోర్స్‌ మ్యాథ్య్‌ పేపర్‌`1 (బైపీసీ            విద్యార్థులకు)

👉 24.03.2025 సోమవారం మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌`1, జాగ్రఫీ పేపర్‌ `1

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ వారం పేపర్‌

👉 06.03.2025 గురువారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌`2

👉 10.03.2025 సోమవారం ఇంగ్లిష్‌ పేపర్‌ పేపర్‌`2

👉 12.03.2025 బుధవారం మాథ్స్‌ పేపర్‌ 2ఎ, బోటని పేపర్‌`2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌`2

👉 15.03.2025 శనివారం మ్యాథ్స్‌ పేపర్‌ 2బి, జువాలజి పేపర్‌`2, హిస్టరీ పేపర్‌`2

👉 18.03.2025 మంగళవారం ఫిజిక్స్‌ , ఎకనామిక్స్‌

👉 20.03.2025 గురువారం కెమిస్ట్రీ , కామర్స్‌

👉 22.03.2025 శనివారం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌`2, బ్రిడ్జ్‌ కోర్స్‌ మ్యాథ్య్‌ పేపర్‌`2 (బైపీసీ విద్యార్థులకు)

👉 25.03.2025 మంగళవారం మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌`2, జాగ్రఫీ పేపర్‌`2

 ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ ఎగ్జామినేషన్‌ : 

29.01.2025 (బుధవారం). సమయం: ఉ.10.00 గం. ` మ.1.00 గం.

ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ ఎగ్జామినేషన్‌ : 

30.01.2025 (గురువారం). సమయం: ఉ.10.00 గం. ` మ.1.00 గం.

ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ షెడ్యూలు..

 ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు జనవరి 31న, 

సెకండియర్‌  విద్యార్థులకు ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు.

ప్రాక్టికల్‌ పరీక్షలు..

I జనరల్‌ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు.

I ఒకేషనల్‌ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు.

సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు