Ticker

6/recent/ticker-posts

Ad Code

గురుకులాలు, హాస్టల్స్‌ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది : CM రేవంత్‌ రెడ్డి


రంగారెడ్డి,  డిసెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిల్కూరులోని టీజీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్‌ డైట్‌ ప్లాన్‌ సిఎం ప్రారంభించారు.తర్వాత విద్యార్థులతో కలిసి సిఎం భోజనం చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతినెల 10న గురుకులాలు, హాస్టల్స్‌ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. గ్రీన్‌ఛానల్‌ ద్వారా నేరుగా అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. ఇకపై ప్రతినెలా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు..గురుకులాలు, హాస్టల్స్‌ను విధిగా పరిశీలిస్తారని చెప్పారు. అలాగే, గురుకులాలు, సంక్షేమహాస్టల్స్‌కు కూడా ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఇక, విద్యార్థుల్లో స్కిల్స్‌ కోసం టాటాగ్రూప్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు చెప్పిన సిఎం.. 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని, ఐటీఐలో చేరితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.


సీఎం మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించిన విూకు ధన్యవాదాలు. కొన్నేళ్లుగా ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులకు టాలెంట్‌ ఎక్కువని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తక్కువ అనే అపోహ బలంగా నాటుకుపోయింది. అలాంటి అపోహలను తొలగించాలని ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. డైట్‌, కాస్మోటిక్‌, మౌలిక వసతులకు గత ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది ప్రజా ప్రభుత్వం అని నిరూపించేందుకు సింగిల్‌ స్ట్రోక్‌ లో డైట్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23లక్షలు విద్యార్థులు చదువుకుంటున్నారు. 11వేల ప్రయివేటుశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువు కుంటున్నారు. ప్రయివేట్‌ స్కూల్స్‌ లో చదువు చెప్పేవారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఎక్కు అర్హత ఉందా? మల్టీ టాలెంటెడ్‌ స్థూడెంట్స్‌ ను మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం..? ఎందుకు మనం ఆ ఆలోచ ఆ చేయకూడదు.. ఇది మన బాధ్యత కాదా? సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల లాంటివి. విద్యార్థుల కోసం పెట్టేది ఖర్చు కాదు..అది వారి భవిష్యత్‌ కు పెట్టుబడి. 70 ఏళ్ల నుంచి మనం నేర్చుకున్నదేంటి... వచ్చే విద్యా సంవత్సరం కోసం ముందు నుంచే ఎందుకు ప్రణాళికలు వేసుకోవడం లేదు..? ఇది ప్రభుత్వం తరపున మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. వీటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇది మన  బాధ్యత.. ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేమని అన్నారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగి ఈ మధ్య ఒక బాలిక  మరణించింది..  ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. శ్రీమంతుడుకి , పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది. 


మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మన గౌరవ ప్రతిష్టలను పెంచేదా.. తగించేదా..? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ నెలా 10వ తేదీలోగా గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధులు అందజేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. విద్యార్థుల యూనిఫామ్‌ కుట్టు పని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించాం. కుట్టు పనికి ఇచ్చే రుసుం రూ.25 నుంచి రూ.75 కు పెంచి వారికి అప్పగించాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నాం. వారంలో రెండు,మూడు రోజులు రెసిడెన్షియల్‌ పాఠశాలలను సందర్శించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. అందుకే రాష్ట్రంలో 75 ఐటీఐ లను టాటా సంస్థతో కలిసి అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌ గ్రేడ్‌ చేసాం. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. మన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ దేశానికే ఆదర్శం. 2028 ఒలింపిక్స్‌  లక్ష్యంగా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ అకాడవిూ ఏర్పాటు చేయబోతున్నాం. క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌ లాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. క్రీడల్లో రాణించండి... విూలో టాలెంట్‌ కు సాన పట్టండి. విద్యార్థులలో ఉన్న ఇతర టాలెంట్‌ ను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. వారికి కావాల్సిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్పొరేట్‌ కు ధీటుగా ప్రతీ నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విద్యార్థులు అనాధాలు కాదు...వాళ్లు రాష్ట్ర సంపద. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత మాపై వుందని అన్నారు. .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు