Ticker

6/recent/ticker-posts

Ad Code

నకిలీ డెత్‌ Certificate తో ఇంటిస్థలం కాజేయాలని యత్నం.

బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చిత్రీకరణ

 హైదరాబాద్‌ కు చెందిన ముఠాను అరెస్టు చేసిన షాద్నగర్‌ పోలీసులు

సబ్‌ రిజిస్టర్‌ పాత్ర పై విచారణ

హైదరాబాద్‌ :  బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్టు చిత్రీకరించి తప్పుడు పత్రాలతో ఇంటి స్థలాన్ని కాజేయాలని, ప్రయత్నించిన ముఠాలోని ఇద్దరు వ్యక్తులను షాద్నగర్‌ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. షాద్నగర్‌ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదురాలు బీహార్‌ రాష్ట్రానికి చెందిన కిరణ్‌ తివారి, తన భర్త అయిన దీపక్‌ తివారి మరియు కొడుకులతో కలిసి  షాద్నగర్‌ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ నివాసం ఉంటూ ఫ్యాక్టరీలో పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, 2013 వ సంవత్సరంలో కమ్మదనం గ్రామ శివారులో గల సర్వేనెంబర్‌ 115, 117, 118 లో బిల్డింగ్‌ బ్లాక్‌ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్‌ వెంచర్‌ నందు 133 గజాలు గల ప్లాట్‌ నెంబర్‌ 1297 కొనుక్కున్నట్లు తెలిపారు. అట్టి ప్లాట్‌ ను హైదరాబాద్‌ కు చెందిన గోపాల్‌ గోపేశ్వర్‌ అని ఇద్దరు వ్యక్తులు ఖరీదు దారు కిరణ్‌ తివారి చనిపోయినట్లు తప్పుడు డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించి, కిరణ్‌ తివారి భర్త దీపక్‌ తివారి ఆస్తులకు వారసుడని, తప్పుడు లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ సృష్టించి, ఆన్లైన్లో లింక్‌ డాక్యుమెంట్‌ మిస్‌ అయినట్లు విూ సేవలో అప్లై చేసుకున్న రిసిప్ట్‌ తీసుకొని, ఆ రిసిప్ట్‌ సహాయంతో  అశోక్‌ టిల్లు  అని వ్యక్తిని కిరణ్‌ తివారి భర్త ఆయన దీపక్‌ తివారికి మారు మనిషిగా పెట్టి  ఈ కేసులో మొదటి నిందితుడైన గోపాల్‌ అనే వ్యక్తి పేరు విూద 2021 సంవత్సరంలో రిజిస్టర్‌ సేల్‌ చేయడం జరిగిందని తెలిపారు. అట్టి సెల్‌ లీడ్‌ చేసిన డాక్యుమెంట్‌ రైటర్‌ విజయ్‌, సాక్షులు చార్మినార్‌ యాకుత్పురాకు చెందిన అబ్దుల్‌ జలీల్‌, రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం బోనగిరి పల్లి గ్రామానికి చెందిన లింగాల విజయ్‌, మరియు అప్పటి ఎస్‌ ఆర్‌ ఓ సతీష్‌ పాత్ర పై ఫిర్యాదురాలు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. 

వీరి పాత్రలపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిందితుడైన గోపాల్‌ తన ముఠాకి చెందిన గోపేశ్వర్‌ అనే వ్యక్తి పేరు పైకి పై ప్లాటును 2022 సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ చేసినాడని తెలిపారు. ఇలా తప్పుడు డాక్యుమెంట్‌ సృష్టించి ఫిర్యాదురాలు కిరణ్‌ తివారి యొక్క ఆస్తిని కాల్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసి ఫిర్యాదురాలు షాద్నగర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా క్రైమ్‌ నెంబర్‌ 541/2023 గా, 419,420, 467, 468, 471 ఐపిసి సెక్షన్ల కింద సెప్టెంబర్‌ 2023 వ సంవత్సరంలో కేసు నమోదు చేసినట్టుగా, తదుపరి కేసు దర్యాప్తు చేపట్టిన సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ విజయ్‌ కుమార్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉమెన్‌ సుశీలలు డిసెంబర్‌ 5` 2024 రోజున మొదటి ముద్దాయి గోపాల్‌ ను అరెస్టు చేసి కస్టడీకి తీసుకొని, మూడవ ముద్దాయి అయిన గోపేశ్వర్‌ ను డిసెంబర్‌ 12` 2024 రోజున అరెస్టు చేసి రిమాండ్‌ తరలించడం జరిగింది అని తెలిపారు. ఈ కేసును చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను అభినందించి, వారికి పై అధికారుల ద్వారా తగిన రివార్డులు ఇవ్వడం జరుగుతుందని పోలీసు శాఖ తెలిపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు