Ticker

6/recent/ticker-posts

Ad Code

ఆట పాటలతో వినూత్న రీతిలో - పాఠాలను భోధిస్తున్న చిలుక Bhaskar

ఆట పాటలతో వినూత్న రీతిలో తెలుగు పాఠాలను బోధిస్తూ తెలుగు భాషపై అభిమానం ను, మమకారం ను విద్యార్థులలో పెంపొందిస్తున్నారు చిలుక భాస్కర్.

హైదరాబాద్ జిల్లా లోని సికింద్రాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నల్లగుట్ట ( బాలంరాయ్)లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి ఈ నెల 31 వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

సహజంగా వాగ్గేయకారుడు కావడం వలన పాఠాలను పాటల రూపంలో పాడి విద్యార్థులకు తెలుగు సాహిత్యం పట్ల జిజ్ఞాస పెంపొందిస్తున్నారు.

27.12.1963 లో శాంతమ్మ, కీ.శే.చిలుక రామయ్య పుణ్య దంపతులకు 7 వ సంతానంగా వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పెద్ద వంగర గ్రామంలో జన్మించారు.ప్రాథమిక విద్యా తమ స్వగ్రామం లో, తొర్రూరు గిరిజన తండాలో జరిగింది.ఉన్నత విద్యా హైదరాబాద్ మీరాలం మండీ, చెత్త బజార్ లో పదవ తరగతి ఉత్తీర్ణులైనారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల చంచల్ గూడ నుండి ఇంటర్మీడియట్ వివేక్ వర్దిని ( వి. వి.) సాయంత్రం కళాశాల నుండి బి.ఏ డిగ్రీ పూర్తి చేశారు.

హైదరాబాద్ లో బాల కార్మికులుగా ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేసి విద్యా పై ప్రేమతో సాయంత్రం కళాశాల లో కష్టపడి చదివారు.సికింద్రాబాద్ బొల్లారం లోని నవభారత్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బి.ఎడ్ పూర్తి చేసి 1996 లో ప్రభుత్వ ఉపాధ్యాయులు గా ఉద్యోగం సాధించారు.

పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలని పేదరికం పోవడానికి చదువు ఒక్కటే పరిష్కార మార్గం అని విద్యార్థులకు చదువుకోవడానికి ప్రొత్సాహం కలిగిస్తున్నారు.

చిలుక భాస్కర్ వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయులైన ప్రవృత్తి సామాజిక చైతన్యం కోసం పాటలు రాయడం పాడటం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రచురించిన పుస్తకాలు 1. సామాజిక చైతన్య పాటలు 2.అక్షరమే రక్ష ( బుర్ర కథ గేయం) 3. ఎయిడ్స్ మరియు బాణామతి ( చేతబడి) ( పల్లె సుద్దులు) 4. బతుకమ్మ ( ఉయ్యాల పాట) 5.చిలుక తెలంగా(ణ)నం 6.తూరుపువాడ( దీర్ఘ గేయ కవిత్వం)

రాబోయే రచనలు.1.చిలుక శతకం.

2.మా ఊరు పచ్చని పైరు 3.భాస్కర పదం మొదలైనవి.

2012 నుండి తెలంగాణ విశ్వవిద్యాలయం ఎం.ఏ విద్యార్థులకు చిలుక భాస్కర్ రాసిన సామాజిక చైతన్య పాటలు పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు.

1977 లో ఆల్ ఇండియా రేడియో లో గాయకుడిగా మొదలు ఇప్పటికీ పాటలు పాడుతునే ఉన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయం లో సుమారు 7000 ప్రదర్శనలు ఇచ్చారు.సమాచార పౌర సంబంధాల శాఖ కళాకారుడిగా 1996 లో పల్లె సుద్దులు కళారూపం లో ప్రధాన కథకుడిగా వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా లలో ప్రదర్శన ఇచ్చారు.2016 లో కృష్ణ మహా పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక నిర్వహించడానికి వాడపల్లి పుష్కరఘాట్ నల్గొండ జిల్లాలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమన్వయ కర్తగా వ్యవహరించారు.

అనేక స్వచ్ఛంద సంస్థలచే  శాలువాలతో పూలతో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు.

గిడుగు రామమూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ గారి ద్వారా గిడుగు సాహిత్య పురస్కారం అందుకున్నారు.వరంగల్ ఆదర్శ యువ మండలి చే 1986 లో ఉత్తమ గాయకుడు గా ప్రశంసలు అందుకున్నారు.ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ 1999 లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను పొందారు.2010 లో ఎన్టీఆర్ కళాక్షేత్రం రంగారెడ్డి వారిద్వారా గాంధీ త్రయం పురస్కారం లభించింది.2010 లో ఆంధ్రప్రదేష్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ దళిత కవితా పురస్కారాన్ని ప్రదానం చేశారు.2015 లో తెలంగాణ  విశ్వవిద్యాలయం చే అభినందన పురస్కారం పొందారు.2016 లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరియు కర్ణాటక దళిత సాహిత్య పరిషత్ చే పురస్కారం లభించింది.2017 లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సిటీ సెంట్రల్ లైబ్రరీ లో నిర్వహించిన కవి సమ్మేళనం లో సాహిత్య పురస్కారం అందుకున్నారు.హుస్నాబాద్ ఉదయ సాహితీ సంస్థ నేటి కవిత పురస్కారం పొందారు.అనేక జిల్లాల, రాష్ట్ర స్వచ్ఛంద సంస్థలు అనేక పురస్కారాలు ఇచ్చి శాలువాలతో సన్మానించారు.

జెండా కవి చిలుక భాస్కర్:-

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చిలుక భాస్కర్ వృత్తి ధర్మం నిర్వహిస్తూ జానపద గీతాలు, కళారూపాల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని తీసుకొని వస్తున్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, బహుజన, సామాజిక సమస్యల్ని పాటల రూపంలో పాడి వాగ్గేయకారుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.చిలుక భాస్కర్ రాసిన గేయాలను సామాజిక గీతాల పేరిట 2015 లో ప్రచురించి తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా దళిత సాహిత్యంలో తమకంటూ ఒక స్థానాన్ని పదిల పరచుకొన్నారు.కాళ్ళకు గజ్జెలు కట్టుకొని గోసి గొంగడి వేసుకొని చేతిలో కంజెర, డోలు,డప్పులతో ప్రముఖ కవి గద్దర్ వేషాధారణలతో అందరిని మరిపించి మురిపించి మై మరిచిపోయేలా అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యా వాధుల నుండి మన దేశానికి 1947 ఆగష్టు 15 నాడు స్వాతంత్ర్యం సిద్ధించింది.గత 78 సంవత్సరాల నుండి భారతీయులు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు జెండా ఎగురవేయడం చేస్తున్నారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 11 నేలల 18 రోజులు కష్టపడి భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంభేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగం రచించబడింది.1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు.

ఆగష్టు 15 నాడు జెండా ను ఎగురవేయడం జనవరి 26 నాడు పతాకావిష్కరణ చేసి ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పించడం, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతీయ పండుగలుగా కుల మత ప్రాంత వర్గ వర్ణ భాష స్త్రీ పురుష లింగ బేధం లేకుండా అందరూ కలిసి మెలిసి మువ్వెన్నెల జెండా ఎగురవేస్తున్నారు.

పాఠశాల విద్యార్థులకు సులభంగా జెండా ప్రాధాన్యత తెలియజేయడానికి " జెండా పండుగ" పేరిట చిలుక భాస్కర్ రాసిన గేయం ఎంతో మంది లబ్ధప్రతిష్టులైన రచయితల, కవుల చేత ప్రశంసలు పొందారు.

జెండా పండుగరా  నేడే జెండా పండుగరా !

స్వాతంత్య్రం గుండెల నిండా నిండిన పండుగరా       " జెండా "

కోడి కూత పొద్దు కాడ

నిదురలేచే ఊరు వాడ

మగవారె గద్దె లేయ

మగువలంతా ముగ్గు బోయ 

                                "జెండా"

బడి పిల్లలే యాడ జాతి గీతమును పాడ

మూడు రంగుల జెండా నెత్తిరి ఊరు రచ్చబండ కాడ 

                        " జెండా "

ఫ్లైట్ మీద చూడు జెండా

రైలు మీద చూడు జెండా

ఓడ మీద చూడు జెండా

మేడ మీద చూడు జెండా

                                      " జెండా"

బడిలోన జెండా గుడి పైన జెండా

ఎద ఎద పై ఎగిసిన జెండ

ఎగురుతుంది ఎర్రకోట గుండా

                                   "జెండా "

కులం పండుగ కాదురో..

మతం పండుగ కాదురో..

కోళ్లు మేక బలి వద్దురో

కోరి పస్తు లుండొద్దురో

కులమత ప్రాంతీయ భేదము విడిసి

భరత ఖండమంత జరుపుకునే ఏకైక పండుగ

                             "జెండా "

అమర వీరులు ఎందరో... 

అందించినదీ స్వేచ్ఛరో..

అరాచకుల నుండిరో ..

ఆదుకునుట మన విధిరో..

ఆంగ్లేయుల పీడ అంతమైనది ఈడ

ఆగస్టు పదిహేనే అందరి పండుగ 

                             " జెండా "

అంటూ విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేస్తున్నారు.చిలుక భాస్కర్ రాసిన " సామాజిక గీతాలు" అనే పుస్తకం 

తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఎం.ఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా 

పెట్టడం జరిగింది.

మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడిచినా సందర్భంగా 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలలో " జాతీయ జెండా"ను ఎగురవేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కాన్వెంట్ చదువులు ఇంటర్నేషనల్ స్కూల్స్ లలో విద్యను అభ్యసిస్తూ మన దేశానికి స్వాతంత్య్రం సాధించిన త్యాగధనుల, స్వాతంత్ర్య సమరయోధుల వీరత్వాన్ని ప్రతిఒక్కరూ చదివి దాచుకోదగిన అధ్భుతమైన, అమూల్యమైన పుస్తకం 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా ప్రస్తానం:-

పేదరికం లో పుట్టి పెరిగిన చిలుక భాస్కర్ ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ ఎస్జీటీ ఉపాధ్యాయులుగా  ఉద్యోగం సంపాదించుకొని 2012 లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, బడుగు, బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వారు ఉండడం వల్ల వారికి అర్థమయ్యేలా ఆట పాటలతో వినూత్న రీతిలో విద్యను బోధించి 31.12.2024 నాడు పదవీ విరమణ చేస్తున్నారు.పదవీ విరమణ తర్వాత తెలుగు సాహిత్యాభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు.ఆట పాటలతో వినూత్న రీతిలో 

పాఠాలను బోధిస్తున్న చిలుక భాస్కర్ 

ఆట పాటలతో వినూత్న రీతిలో తెలుగు పాఠాలను బోధిస్తూ తెలుగు భాషపై అభిమానం ను, మమకారం ను విద్యార్థులలో పెంపొందిస్తున్నారు చిలుక భాస్కర్.

హైదరాబాద్ జిల్లా లోని సికింద్రాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నల్లగుట్ట ( బాలంరాయ్)లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి ఈ నెల 31 వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

సహజంగా వాగ్గేయకారుడు కావడం వలన పాఠాలను పాటల రూపంలో పాడి విద్యార్థులకు తెలుగు సాహిత్యం పట్ల జిజ్ఞాస పెంపొందిస్తున్నారు.

27.12.1963 లో శాంతమ్మ, కీ.శే.చిలుక రామయ్య పుణ్య దంపతులకు 7 వ సంతానంగా వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పెద్ద వంగర గ్రామంలో జన్మించారు.ప్రాథమిక విద్యా తమ స్వగ్రామం లో, తొర్రూరు గిరిజన తండాలో జరిగింది.ఉన్నత విద్యా హైదరాబాద్ మీరాలం మండీ, చెత్త బజార్ లో పదవ తరగతి ఉత్తీర్ణులైనారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల చంచల్ గూడ నుండి ఇంటర్మీడియట్ వివేక్ వర్దిని ( వి. వి.) సాయంత్రం కళాశాల నుండి బి.ఏ డిగ్రీ పూర్తి చేశారు.

హైదరాబాద్ లో బాల కార్మికులుగా ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేసి విద్యా పై ప్రేమతో సాయంత్రం కళాశాల లో కష్టపడి చదివారు.సికింద్రాబాద్ బొల్లారం లోని నవభారత్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బి.ఎడ్ పూర్తి చేసి 1996 లో ప్రభుత్వ ఉపాధ్యాయులు గా ఉద్యోగం సాధించారు.

పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలని పేదరికం పోవడానికి చదువు ఒక్కటే పరిష్కార మార్గం అని విద్యార్థులకు చదువుకోవడానికి ప్రొత్సాహం కలిగిస్తున్నారు.

చిలుక భాస్కర్ వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయులైన ప్రవృత్తి సామాజిక చైతన్యం కోసం పాటలు రాయడం పాడటం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రచురించిన పుస్తకాలు 1. సామాజిక చైతన్య పాటలు 2.అక్షరమే రక్ష ( బుర్ర కథ గేయం) 3. ఎయిడ్స్ మరియు బాణామతి ( చేతబడి) ( పల్లె సుద్దులు) 4. బతుకమ్మ ( ఉయ్యాల పాట) 5.చిలుక తెలంగా(ణ)నం 6.తూరుపువాడ( దీర్ఘ గేయ కవిత్వం)

రాబోయే రచనలు.1.చిలుక శతకం.2.మా ఊరు పచ్చని పైరు 3.భాస్కర పదం మొదలైనవి.

2012 నుండి తెలంగాణ విశ్వవిద్యాలయం ఎం.ఏ విద్యార్థులకు చిలుక భాస్కర్ రాసిన సామాజిక చైతన్య పాటలు పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు.

1977 లో ఆల్ ఇండియా రేడియో లో గాయకుడిగా మొదలు ఇప్పటికీ పాటలు పాడుతునే ఉన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయం లో సుమారు 7000 ప్రదర్శనలు ఇచ్చారు.సమాచార పౌర సంబంధాల శాఖ కళాకారుడిగా 1996 లో పల్లె సుద్దులు కళారూపం లో ప్రధాన కథకుడిగా వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా లలో ప్రదర్శన ఇచ్చారు.2016 లో కృష్ణ మహా పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక నిర్వహించడానికి వాడపల్లి పుష్కరఘాట్ నల్గొండ జిల్లాలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమన్వయ కర్తగా వ్యవహరించారు.

అనేక స్వచ్ఛంద సంస్థలచే  శాలువాలతో పూలతో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు.

గిడుగు రామమూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ గారి ద్వారా గిడుగు సాహిత్య పురస్కారం అందుకున్నారు.వరంగల్ ఆదర్శ యువ మండలి చే 1986 లో ఉత్తమ గాయకుడు గా ప్రశంసలు అందుకున్నారు.ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ 1999 లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను పొందారు.2010 లో ఎన్టీఆర్ కళాక్షేత్రం రంగారెడ్డి వారిద్వారా గాంధీ త్రయం పురస్కారం లభించింది.2010 లో ఆంధ్రప్రదేష్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ దళిత కవితా పురస్కారాన్ని ప్రదానం చేశారు.2015 లో తెలంగాణ  విశ్వవిద్యాలయం చే అభినందన పురస్కారం పొందారు.2016 లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరియు కర్ణాటక దళిత సాహిత్య పరిషత్ చే పురస్కారం లభించింది.2017 లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సిటీ సెంట్రల్ లైబ్రరీ లో నిర్వహించిన కవి సమ్మేళనం లో సాహిత్య పురస్కారం అందుకున్నారు.హుస్నాబాద్ ఉదయ సాహితీ సంస్థ నేటి కవిత పురస్కారం పొందారు.అనేక జిల్లాల, రాష్ట్ర స్వచ్ఛంద సంస్థలు అనేక పురస్కారాలు ఇచ్చి శాలువాలతో సన్మానించారు.

మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడిచినా సందర్భంగా 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలలో " జాతీయ జెండా"ను ఎగురవేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కాన్వెంట్ చదువులు ఇంటర్నేషనల్ స్కూల్స్ లలో విద్యను అభ్యసిస్తూ మన దేశానికి స్వాతంత్య్రం సాధించిన త్యాగధనుల, స్వాతంత్ర్య సమరయోధుల వీరత్వాన్ని ప్రతిఒక్కరూ చదివి దాచుకోదగిన అధ్భుతమైన, అమూల్యమైన పుస్తకం 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా ప్రస్తానం:-

పేదరికం లో పుట్టి పెరిగిన చిలుక భాస్కర్ ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ ఎస్జీటీ ఉపాధ్యాయులుగా  ఉద్యోగం సంపాదించుకొని 2012 లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, బడుగు, బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వారు ఉండడం వల్ల వారికి అర్థమయ్యేలా ఆట పాటలతో వినూత్న రీతిలో విద్యను బోధించి 31.12.2024 నాడు పదవీ విరమణ చేస్తున్నారు.పదవీ విరమణ తర్వాత తెలుగు సాహిత్యాభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు.

              డాక్టర్.శ్రీవాటి శ్రీనాథ్                                                            డాక్టర్. ఎస్. విజయ భాస్కర్.,

 హైదరాబాద్ జిల్లా టి.ఆర్.టి.ఎఫ్ అధ్యక్షులు                                 ప్రధాన కార్యదర్శి 

                                                                                                                        ..................... 

                                                                                                                             ........

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు