Ticker

6/recent/ticker-posts

Ad Code

మహిళ University కి చాకలి ఐలమ్మ పేరు అభినందనీయం !


ఐలమ్మ స్ఫూర్తితో
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా లన : 
MLA  సంజయ్‌ కుమార్‌


జగిత్యాల,సెప్టెంబర్ 24 (ఇయ్యాల తెలంగాణ) : మహిళ యూనివర్శిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయం ఆని,ఐలమ్మ స్ఫూర్తి తో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొన సాగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్‌ కుమార్‌ ఆన్నారు.జగిత్యాల పట్టణ చింతకుంట మిని ట్యాంక్‌ బండ్‌ వద్ద జగిత్యాల పట్టణం రజక సంఘం ఆధ్వర్యంలో కోఠి మహిళ విశ్వ విద్యా లయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే డా సంజయ్‌ కుమార్‌ ,మున్సిపల్‌ చైర్మన్‌ ఆడువాల జ్యోతి లక్ష్మణ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోఠి మహిళ విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన ముఖ్యమంత్రి కి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు.భూస్వాములు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వీర నారి ఐలమ్మ అన్నారు.ఐలమ్మ పోరాటం నేటి మహిళలకు,సమాజానికి స్ఫూర్తిదాయకం ఆన్నారు.జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కి ముఖ్యమంత్రి తో కలిసి పనిచేస్తానని తెలిపారు.రైతు బిడ్డగా,తెలంగాణ రాష్ట్రం,జగిత్యాల నియోజకవర్గం పై పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి సహకారం తో జగిత్యాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఐలమ్మ స్ఫూర్తి తో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఉద్యమ కారులు,పోరాట యోధులను తెలంగాణ రాష్ట్రంలో గౌరవించుకుంటామని అన్నారు .ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌,స్థానిక కౌన్సిలర్‌ లు బాలే శంకర్‌, పంబాల రాం కుమార్‌,పద్మావతి పవన్‌,కప్పల శ్రీకాంత్‌,రజీయుద్దీన్‌,కూతురు రాజేష్‌,సంఘం అధ్యక్షులు దేవరాజ్‌ ఉపాధ్యక్షులు హనుమాన్లు కార్యదర్శి మరిపెళ్లి శ్రీనివాస్‌ నాయకులు దుమల రాజ్‌ కుమార్‌, పెద్దింటి రాజు ,భూమయ్య రమేష్‌, శ్రీనివాస్‌ ,సుమన్‌ రావు, గౌస్‌,గట్టు రాజు, రజక సంఘం  కార్యవర్గ సభ్యులు నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు