చార్మినార్, సెప్టెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ) : మిలాద్ - ఉన్ - నబి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీలో చార్మినార్ దగ్గర డీజే లో ఉన్న టపాసుల కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కొందరు ముస్లిం యువకులు తెలిపారు.
దేవాలయానికి ఎలాంటి ప్రమాదం లేదు.
మిలాద్ ఉన్ నబి వేడుకలను పురస్కరించుకొని జరిగిన అగ్ని ప్రమాదంలో కొందరు అల్లరి మూకలు భాగ్యలక్ష్మీ ఆలయం మంటల్లో చిక్కుకున్నట్లు ఓ వీడియోను వైరల్ చేశారు. దీంతో పాతనగరంలోని చాలా మందిలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పాటు అందరూ ఫోన్లను చూసి ఒకేసారి షాకయ్యారు. కానీ అందరూ అనుకున్నట్లు ఎలాంటి ఇబ్బందులు లేవని దేవాలయం దగ్గర అంతా సురక్షితంగా ఉన్నట్లు దేవాలయ కమిటీ తెలిపింది. దీనికి సంబంధించి కొద్దీ క్షణాల క్రితం భాగ్యలక్ష్మీ టెంపుల్ ట్రస్టీ దేవాలయ వీడియోను రిలీజ్ చేశారు. దేవాలయం కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నదని అనవసరంగా ఎవరూ ఉత్కంఠకు గురి కావద్దని ప్రకటించారు.