నిర్మల్ సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : Ñబీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 30న 24 గంటల పాటు రైతులతో కలిసి ధర్నాచౌక్ (హైదరాబాద్) లో రైతు హావిూల సాధన దీక్షను చేపడుతున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిబ్నిర్మల్ బిజెపి క్యాంపు ఆఫీస్ లో విూడియా సమావేశం లో మాట్లాడారు. సర్కార్ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటంప్రజలకు ఇచ్చిన 420 హావిూల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు.రుణమాఫీ పూర్తి చేయకుండానే సర్కార్ రైతులను మోసం చేస్తోందిలక్ష రుణమాఫీకే గత సర్కార్ 19వేల కోట్లు ఖర్చు చేసిందిరూ.2 లక్షల రుణమాఫీకి దాదాపు 40వేల కోట్లు ఖర్చు అవుతాయ.ఇదే విషయాన్ని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటి వరకు కేవలం 17వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది.
ఇంకా రూ. 18వేల కోట్లు రుణమాఫీకి అవసరం అని మంత్రులు అంటున్నారు.ప్రభుత్వమేమో రుణమాఫీ పూర్తి అయింది అంటోంది. రూ. 17వేల కోట్లతో 2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం అయిందో వారే చెప్పాలన్నారు..సన్న వడ్లకే బోనస్ అనడం, మోసం చేయడమే ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా సర్కార్ మోసం చేస్తోంది.అన్నదాతలకు అండగా, హావిూలు అమలు చేసేలా సర్కార్ పై ఒత్తిడి తెస్తా మన్నారు.తెలంగాణలో దొడ్డు వడ్లనే రైతులు ఎక్కువగా పండిస్తారు.కేవలం 20శాతం మంది పండిరచే రైతులకే ప్రయోజనం.బోనస్ భారం తప్పించుకునేందుకే సర్కార్ సన్నాయి నొక్కులు.తొమ్మిదిన్నర నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏవిూ లేదురుణమాఫీ పూర్తిగా చేయలేదురైతు భరోసా ఊసే లేదు.ఫీజు రీ యింబర్స్ మెంట్ లేదునిరుద్యోగులకు భృతి లేదుపింఛన్లు పెంచలేదుహోంగార్డులకు ఉద్యోగ భద్రత లేదురేషన్ కార్డులు ఇవ్వలేదుపేదలకు పక్కా ఇండ్ల ప్రస్తావనే లేదుకేవలం ఆస్థాన గుత్తేదారులకు దోచిపెట్టడానికే సర్కార్ పనిచేస్తోందని విమర్శించారు.ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తోన్న సర్కార్పేదలకు ఇచ్చిన హావిూల కోసం పైసా ఖర్చు చేయని సర్కార్.కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి మాత్రం నిధులు ఖర్చు.ఇప్పటికే రూ. 56వేల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం.ఆడంబరాలతో ప్రజలపై పెరుగుతున్న అప్పుల భారంహైడ్రా పేరుతో హిందువుల ఆస్తులు టార్గెట్ చేస్తూ పాతబస్తీ జోలికివెళ్లని హైడ్రా బుల్డోజర్లు.హైడ్రా ముసుగులో ప్రభుత్వం దందా చేసున్న అని అన్నారు.