Ticker

6/recent/ticker-posts

Ad Code

మూసీనది ప్రక్షాళన ? 13 వేల ఇండ్లు గుర్తింపు: CM రేవంత్‌


హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 25 (ఇయ్యాల తెలంగాణ) :  మూసీ రివర్‌ బెడ్లో, ఎఫ్‌ టిఎల్‌, బఫర్‌ జోన్‌ లో ఉన్న ఇళ్లను తొలగింపుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూసీ నది ప్రక్షాళనకు సర్కార్‌ చర్యలు తీసుకుంటుందని రేవంత్‌ స్పష్టం చేశారు. సర్వేలో 13 వేల ఇండ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించామని వాటిని తొలగిస్తా మన్నారు. మూసీ పరిసర ప్రాంతాల తహసీల్దార్లతో హైదరాబాద్‌ కలెక్టర్‌ విూటింగ్‌ ఉంటుందని వివరించారు. మూసీ పరివాహక ప్రాంత ఇళ్లకు అతి త్వరలో అధికారులు నోటీసులు జారీ చేస్తారని తెలియజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు