హైదరాబాద్, ఆగస్టు 31, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రజలను వాతావారణ శాఖ అలర్ట్ చేసింది. శనివారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో వేగంతో కూడిన ఈదుగు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య మరియు దాని సవిూపంలోని పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్ , బ్రహ్మపురి జగదల్పూర్, కళింగపట్నం విూదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది.ఈ కారణంగా తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరి కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.అలాగే నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కి. విూ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
0 కామెంట్‌లు