హైదరాబాద్, ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ) : షెడ్యూల్డ్ కాస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్గీకరణకు మద్దతుగా సుప్రీమ్ కోర్టు అందించిన తీర్పుకు అనుకూలంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉప వర్గీకరణ అమలయ్యేటట్లు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉప్పుగూడ అంబికా నగర్ లోని మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి వివిధ షెడ్యూలు కులాల, మాదిగ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఎమ్మార్ఫీఎస్ నాయకులు మంద కృష్ణ మాదిగ చేసిన ఉద్యమానికి ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారని అన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీమ్ కోర్టు ఆదేశానుసారం ప్రభుత్వాలకు సంబందించిన అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఏబీసీడీ ఫలాలు అందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని వర్గీకరణ అమలయ్యేలా చూడాలని షెడ్యూల్డ్ కులాల సంఘం ప్రధాన కార్యదర్శి రాజపాగ అర్జున్ కోరారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక చర్యలు తీసుకోవాలన్నారు.
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్ర బాబు ప్రభుత్వం ఏబీసీడీ లపై ప్రత్యేక దృష్టి కేంద్రకరించి అన్ని శాఖల్లో వర్గీకరణ దిశగా చర్యలు తీసుకున్నట్లు సభా ముఖంగా గుర్తు చేశారు. మాదిగ యువకులు అన్ని రంగాల్లో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం సంపాదించడానికి కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బండి నరేష్ యువతకు సూచించారు. కార్యక్రమంలో నర్సింహా స్వామి, మంద నగేష్, వర్కాల సత్యనారాయణ తదితరులు వర్గీకరణ ఉద్యమం తీరును తమ వంతు పాత్రను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జె. మురళీధర్, మహేష్, దుర్గ రాజ్, గణేష్, కె. భుజందర్ బాబు తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొని వర్గీకరణపై తమ అనుభవాల్ని పంచుకున్నారు.
0 కామెంట్‌లు