Ticker

6/recent/ticker-posts

Ad Code

అభయ్‌ పాటిల్‌ Entry !

కార్యకర్తలకు అభయం అందినట్టేనా 

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ.. అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు టార్గెట్‌గా పెట్టుకుని.. మిషన్‌ 90 పేరుతో హడావుడి చేసిన బీజేపీ 8 సీట్లకు పరిమితమై ఘోరపరాజయం పాలైంది. తెలంగాణలో బీజేపీనే బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని కమలనాథులు పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ.. ఎన్నికల సమాయానికి పేక మేడ కూలినట్టు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధించాలని బీజేపీ పెట్టుకున్న టార్గెట్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. లక్ష్యాలు అయితే ఘనంగా కనిపిస్తున్నాయి కాని  అవి నెరవేర్చుకునే దిశగా మాత్రం నేతల కార్యాచరణ కనిపించడం లేదు. అది చాలదన్నట్టు అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతున్నట్లు కనిపిస్తుంది.రాష్ట్రంలో బీజేపీ బలోపేతం సంగతి అటుంచితే .. నేతలకు అంతర్గత కుమ్ములాటల విూద ఉన్న శ్రద్ద అనుకున్న లక్ష్యం విూద ఉండదనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల నుంచే బలంగా వినిపిస్తోంది. ముందు నుంచి కూడా రాష్ట్ర కాషాయ నేతలంతా ఒక డిఫరెంట్‌ మైండ్‌సెట్‌తో ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. పార్టీలో సఖ్యత, క్రమశిక్షణ లేకపోవడం, కొత్త నేతలెవరొచ్చినా జీర్ణించుకోలేని మనస్తత్వాలు ప్రస్పుటమవుతూనే వస్తున్నాయి. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్‌, వివేక్‌, జితేందర్‌రెడ్డి లాంటి బలమైన నేతలు పార్టీలోకి వచ్చినప్పటికీ నిలబెట్టుకోలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఊపు విూదున్న బీజేపీ అంతర్గత కుమ్ములాటలు, ముఖ్యనేతల వలసలతో పూర్తిగా చతికిలబడి ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.అధికారం కోసం జాతీయ నేతలంతా తెలంగాణలో మకాం వేసినా అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న బండి సంజయ్‌ను తప్పించడం పార్టీకి తీరని నష్టం చేకూర్చిందనే అంచనాకు బీజేపీ అధిష్టానం వచ్చిందంట.. అధ్యక్షుడి మార్పే కాదు, అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల టికెట్లు అమ్ముకున్నారనే ప్రచారం కూడా మైనస్‌ అయ్యిందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో జరిగింది. 

సీట్లు అమ్మకమే కాదు అసెంబ్లీ ఎన్నికల ముందు ఫామ్‌ హౌస్‌ ఎపిసోడ్‌ దేశ వ్యాప్తంగా పెద్ద దూమారమే లేపింది.గతంలో వున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మోడీ ప్రభుత్వం ఎమ్మెల్లేలను కొనుగోలు చేయడానికి .. ఒక్కో ఎమ్మెల్లేకు భారీగా ముడుపులు అందించేందుకు ప్లాన్‌ చేసిందని బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. అందుకు ఫామ్‌ హౌస్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్లేలతో మంతనాలు జరిపిన కొంతమంది బీజేపీ మధ్యవర్తుల ఆడియో, వీడియోలను స్టింగ్‌ ఆపరేషన్‌తో బీఆర్‌ఎస్‌ బయటపెట్టింది. బీజేపీ చేస్తున్న కుట్రలను బయట పెట్టామని గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా విూడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఆ వివాదం బీజేపీని కోలుకోలేని దెబ్బ తీసింది.అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే, రెండు పార్టీల మద్య ఒప్పందం ప్రకారమే పనిచేస్తున్నాయని కాంగ్రెస్‌ సమర్ధంగా ప్రచారం చేయగలిగింది. అది ప్రజల్లోకి చొచ్చుకెళ్లడంతో ఆ రెండు బీ పార్టీలు చావుదెబ్బ తిన్నాయి. ఇక పార్లమెంట్‌ ఎన్నికల్లో మోడీ గ్లోబల్‌ ప్రచారం బాగా పనిచేయడంతో పాటు.. కాంగ్రెస్‌ దూకుడుని కట్టడి చేయడానికి బీఆర్‌ఎస్‌ లోపాయికారిగా సహకరించడంతో రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకుందన్న అభిప్రాయం ఉంది.ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణకు కొత్త ఇన్చార్జ్‌ని నియమించింది బీజేపీ అధిష్టానం.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌గా తరుణ్‌ చూగ్‌, సునిల్‌ బన్సల్‌ లు వ్యవహారించారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు రాష్ట్ర ఇన్చార్చ్‌గా ప్రకాష్‌ జవదేకర్‌ వ్యవహారించారు. 

పార్లమెంట్‌ ఎన్నికలకు అభయ్‌ పాటిల్‌ రాష్ట్ర ఇన్చార్జ్‌గా వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాష్‌ జవదేకర్‌ నేతృత్వంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ఘోరంగా విఫలమైన కాషాయ దళం.. పార్లమెంట్‌ ఎన్నికల్లో అభయ్‌ పాటిల్‌ నేతృత్వంలో టార్గెట్‌కి దగ్గరగా రావడంతో ఆయన వైపే ఢల్లీి పెద్దలు మొగ్గు చూపారంట.పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన పాజిటివ్‌ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని అభయ్‌ పాటిల్‌ను తిరిగి రాష్ట్ర ఇన్చార్జ్‌గా నియమించారంటున్నారు.. కర్నాటకకు చెందిన అభయ్‌ పాటిల్‌ బెల్గాం నియెజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా డిల్లీలో జరిగిన జాతీయ పార్టీ సమావేశంలో తాను తెలంగాణ ఇన్చార్జ్‌గా పాల్గొన్నానని పాటిల్‌ స్వయంగా ఎక్స్‌ వేదికగా ప్రకటించుకున్నారు. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దాన్ని ఖండిరచారు. అయితే కిషన్‌ రెడ్డి మాటలను లెక్కచేయకుండా తెలంగాణ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి అభయ్‌ పాటిల్‌ హాజరయ్యారు. జాతీయ నాయకత్వం మౌఖిక ఆదేశాలతో అభయ్‌ పాటిల్‌ తెలంగాణ పార్టీ ఇంచార్జ్‌ గా తనకు తానే స్వయంగా ప్రకటించుకున్నారంట.. ఏదేమైనా అభయ్‌కు అతి తక్కువ కాలంలోనే అగ్ర నేతగా ఎదిగిన అభయ్‌ పాటిల్‌ తెలంగాణ పార్టీలో పరిస్థితులను ఏ మాత్రం చక్కదిద్దుతారో?  రాష్ట్ర ఇన్చార్జీగా ఏమేరకు సక్సెస్‌ అవుతారో చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు