ముదిరాజ్ కులస్తులను BC డి నుంచి ఏ కు మార్చాలి !
గురువారం, ఆగస్టు 01, 2024
0
హైదరాబాద్, జూలై 01 (ఇయ్యాల తెలంగాణ) : బీసీల కష్టాల గురించి తెలుసు కాబట్టే ఎమ్మెల్యే కె.పి వివేకానంద గౌడ్ వారి పరిస్థితిని ముందుంచారని అఖిల భారత కోహ్లీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ముదిరాజ్ కులస్తులను బిసి డి నుంచి ఏకు మార్చాలని అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద గౌడ్ ఒక బీసీ ఎమ్మెల్యే కాబట్టి బీసీల కష్టాల గురించి అసెంబ్లీలో లేవలెత్తినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలతో ధన్యవాదాలు ముదిరాజులు స్థితి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అసెంబ్లీలో సమయం తీసుకొని ముదిరాజ్ గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అఖిల భారత కోహ్లీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి డైనమిక్ యువ నాయకుడు రేవంత్ రెడ్డి వీలైనంత త్వరలో ముదిరాజుల సమస్య పరిష్కారానికి ఆశిస్తున్నట్లు తెలిపారు.
Tags