మేడ్చల్ జులై 4 (ఇయ్యాల తెలంగాణ ):ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎఫెక్ట్ తో ఉప్పల్ సర్కిల్ 2 లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. ఉప్పల్ జీహెచ్ ఎంసీ లో బుధవారం జరిగిన సవిూక్ష సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఏసిపి వెంకట రమణ పై ఎమ్మెల్యే గరంగరంఅయిన విషయం తెలిసిందే.దాంతో గురువారం నాడు అక్రమ నిర్మాణాలపై ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఉక్కుపాదం మోపారు. హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8లోని అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసారు. టౌన్ ప్లానింగ్ అధికారి పై విమర్శలకు గానూ రేపటి నుండి ఉప్పల్ బాగాయత్ లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. .
0 కామెంట్‌లు