UP లో ఘోర రైలు ప్రమాదం...నలుగురు మ్రుతి !
గురువారం, జులై 18, 2024
0
లక్నో, జూలై 18 (ఇయ్యాల తెలంగాణ) : యూపీలోని గోండాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా రైల్వే స్టేషన్ సవిూపంలో డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో చాలా మంది ప్రయాణికులు రైలులోనే చిక్కుకుపోయారు. ఈ రైలు ప్రమాదంలో 12 బోగీలు పక్కకు ఒరిగిపోయినట్లు తెలిసింది. సరిగ్గా గోండా ` మంకాపూర్ సెక్షన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయంపై వెంటనే స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద స్థలానికి చేరుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారతీయ రైల్వే అధికారులు కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోండా రైల్వే స్టేషన్ దగ్గర్లో మధ్యాహ్నం 2:35 గంటలకు చండీగఢ్ ` దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని రైల్వే శాఖ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. రైలు నంబరు 15904. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే దానిపై ఇంకా సమాచారం లేదు. దిబ్రూగఢ్ ` చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనపై ఈశాన్య రైల్వే సీపీఆర్వో పంకజ్ సింగ్ మాట్లాడుతూ.. రైల్వే మెడికల్ వ్యాన్ సంఘటనా స్థలానికి చేరుకుందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని.. హెల్ప్‌లైన్ నంబర్లు జారీ చేశామని చెప్పారు. మధ్యాహ్నం 2.37 గంటలకు ఇది జరిగిందని.. ప్రాథమిక సమాచారం ప్రకారం, 4`5 కోచ్‌లు పట్టాలు తప్పాయని చెప్పారు.
Tags