Ticker

6/recent/ticker-posts

Ad Code

PM మోఢీతో CM రేవంత్‌, డిప్యూటీ CM భట్టి విక్రమార్క భేటీ !


న్యూడిల్లీ జూలై 4 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్  అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులను కలిశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోఢీతో సిఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈసందర్భంగా విూడియాతో మాట్లాడిన సిఎం.. రాష్ట్ర అభివృద్ధికి సహకిరించాలని కోరినట్లు చెప్పారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయన్నారు.రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతోనే ప్రధాని, కేంద్రమంత్రులను కలిశామన్నారు. వివిధ శాఖల్లో పెండిరగ్‌లో ఉన్న అంశాలను పరిష్కనరించాలని వినతిపత్రాలు ఇచ్చామని చెప్పారు. ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. విభజన హావిూల పరిష్కారించాలని కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలని కోరినట్లు సిఎం రేవంత్‌ తెలిపారు. అనంతరం మాట్లాడిన డిప్యూటీ సిఎం భట్టి.. తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్‌ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ప్రధాని మోడీని కోరామన్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని, వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని కోరామని ఆయన చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు