హైదరాబాద్, జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే తెలంగాణ బోనాల జాతర వేడుకలు ఆదివారం ఘనంగా ముగిసాయి. సోమవారం ఘటాల ఊరేగింపు సందర్భంగా అనురాధ భవిష్య వాణితో సామూహిక ఘటాల ఊరేగింపు జాతర మొదలైంది. నా భక్తులందరిని చల్లంగా కాపాడుకుంటానని భవిష్యవాణి విన్పించింది.అమ్మవారి ఆలయానికి స్థలాన్ని పెంచాలని, లేని పోనీ రోగాలు మీరే తెచ్చుకున్నా నేనే కాపాడు కుంటున్నానని అన్నింటిని పారద్రోలుతున్నాన్నని భవిష్యవాణి వినిపించింది. భవిష్యవాణి తో ప్రస్తుతం పాతబస్తీలో బోనాల ఘటాల ఊరేగింపు జాతర మొదలైంది. గంటల ఊరేగింపు నయాపూల్ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే వేలాది సంఖ్యలో భక్తులు ఘటాల ఊరేగింపు జాతరలో పాల్గొన్నారు.
Old Cityలో భవిష్యవాణితో మొదలైన సామూహిక ఘటాల ఊరేగింపు జాతర !
సోమవారం, జులై 29, 2024
0
Tags