ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అడిగితే కోర్టుకు వెళ్ళమన్న రామడుగు MRO !
సోమవారం, జులై 29, 2024
0
రామడుగు, జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) : రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్ గౌడ్ అవసరాల నిమిత్తం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం గత కొద్ది రోజుల క్రితం శ్రీనివాస్ గౌడ్ రామడుగు తహసిల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకోగా కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ కావాలంటే కోర్టుకు వెళ్లాలని ఎమ్మార్వో భాస్కర్ ఉచిత సలహాలు ఇచ్చారని పొన్నం శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా గోపాల్ రావు పేటలో సోమవారం పాత్రికేయుల ముందు ఆయన గోడు వెళ్ళ పోశాడు. కుటుంబ అవసరాల నిమిత్తం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అర్జీ పెట్టుకుంటే ఎమ్మార్వో భాస్కర్ బ్యాంకు లావాదేవీల కోసం కుటుంబ సభ్యులు సర్టిఫికెట్ జారీ చేస్తామని మరి ఏ ఇతర పనులకు సర్టిఫికెట్ కావాలంటే కోర్టును ఆశ్రయించమనడం చాలా బాధాకరమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అధికారులు జారీ చేయాల్సిన సర్టిఫికెట్ దానిని కోర్టు ద్వారా తీసుకోమనడం ఎంతవరకు సమంజసం అన్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని బిజెపి కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ పత్రిక ముఖంగా తెలియజేశారు.
Tags