వనమహోత్సవంలో చెట్లు నాటిన ఎమ్మెల్యే
మెట్పల్లి, జులై 18 (ఇయ్యాల తెలంగాణ) : వనమహోత్సవ కార్యక్రమం లో భాగంగా , చెట్లు అందరికి వరంలాంటిదని, వాటిని సంరక్షించే బాధ్యత మనందరిదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని మెట్ పల్లి మునిసిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుపగా, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అతిథిగా పాల్గొని కుప్సింగ్ కుంట పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెట్లు మనకు వరంలాంటివని, అవి మనకు ప్రాణం పోస్తుందని, కాలుష్యాన్ని నివారిస్తుందని తెలిపారు. వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనం రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తుందని తెలిపారు. ఈ మధ్య చెట్లు నరకడం ఎక్కువైపోయిందని, వాటిని సంరక్షించే బాధ్యత మనందరిదని,ప్రభుత్వ అన్ని శాఖలను, రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, మునిసిపల్ సిబ్బంది, వార్డ్ కౌన్సిల్లర్లు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.