`నేడు ఆయన వర్ధంతి
మార్షల్ ఆర్ట్స్ లో రాజాధిరాజు బ్రూస్లీ, అయన అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన కరాటే యోధుడు, నటుడు. ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలోనే ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు.బ్రూస్ లీ 1964 లో లిండా ఎమెరీని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆయన కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ కూడా నటులే. తమ్ముడు రాబర్ట్ 1960వ దశకంలో హాంకాంగ్ ను ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు. బ్రూస్ లీ లో తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు లీని అమితంగా అభిమానించేవారు. చైనీయుల సాంప్రదాయ క్రీడjైున కుంగ్ ఫూను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించేవాడు. బ్రూస్లీ నవంబరు 27, 1940 న కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో పుట్టి, హాంకాంగ్ లో పెరిగాడు. ఇతని అసలు పేరు లీ జూన్ ఫాన్. లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం. బ్రూస్ లీ 1973 వ సంవత్సరంలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో నటించాడు. కానీ, అతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు. అప్పటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్ లీ అభిప్రాయపడేవాడు. అన్నిరకాలుగా ఫిట్ గా ఉండటం కోసం బాగా కసరత్తు చేసేవాడు. వింగ్ చున్ విధానంలోని వన్ ఇంచ్ పంచ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వస్తువుకు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు.
సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. వస్తువుకు అతి సవిూపం నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుందన్నది ఆశ్చర్యం కలిగించినా, అది అక్షరసత్యమని నిరూపించాడు బ్రూస్ లీ. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు బ్రూస్ లీ. బ్రూస్ లీ గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం.. పీడ్ ఫైటింగ్ టెక్నిక్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బ్రూస్ లీ. 32 ఏళ్లకే చనిపోయిన ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.బ్రూస్ లీ ప్రైవేట్‌గా కుంగ్ ఫూ పాఠాలు చెప్పటానికి గంటకు 275 డాలర్లు వసూలు చేసేవాడు.ఫైటింగ్లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్పపాటు కంటే వేగంగా కదులుతుంది. ఈ వేగాన్ని నిరూపించటం కోసం బ్రూస్ లీ ఓ టెక్నిక్ ప్రదర్శించేవాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణాన్ని ఉంచుకుని అరచేతిని మూసేలోగా బ్రూస్ లీ ఆ నాణాన్ని దొరకపుచ్చుకునేవాడు.ఒక అంగుళం దూరం నుంచే పవర్ఫుల్ పంచ్ ఇవ్వటంలో బ్రూస్ లీ నేర్పరి. 1973 జులై 20 న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం. వెంటనే లీని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికీ బ్రూస్ లీ కోమాలోకి వెళ్ళిపోయారు. ఒక గంటలోనే చనిపోయాడు.
``