ముంబై, జూలై 4, (ఇయ్యాల తెలంగాణ );దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీని ప్రభావం ఏపీ, తెలంగాణలో కూడా కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,340వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 20 తగ్గుదల కనిపించింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 96,000కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ. 96,100కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం రేట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీరేట్లలో మార్పులు, ప్రపంచదేశాల ఆర్థిక మాంద్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంలో వచ్చిన మార్పులు అన్నీ వెరసి పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
24 క్యారెట్ల బంగారం ధరలు..హైదరాబాద్ ? రూ. 72,370 విజయవాడ ? రూ. 72,370 బెంగళూరు ? రూ. 72,370 ముంబై ? రూ. 72,370 కోల్?కత్తా ? రూ.72,370 ఢల్లీి ? రూ.72,520 చెన్నై ? రూ.73,050
22 క్యారెట్ల బంగారం ధరలు..హైదరాబాద్ ? రూ. 66,340 విజయవాడ ? రూ. 66,340 బెంగళూరు ? రూ. 66,340 ముంబై ? రూ. 66,340 కోల్?కత్తా ? రూ. 66,340 ఢల్లీి ? రూ. 66,490 చెన్నై ? రూ. 66,960
కిలో వెండి ధరలు ఇలా..హైదరాబాద్ ? రూ. 96,100 విజయవాడ ? రూ. 96,100 ముంబై ? రూ. 96,100 చెన్నై ? రూ. 96,100 కోల్?కత్తా ? రూ. 91,600 ఢల్లీి ? రూ. 91,600 బెంగళూరు ? రూ. 90,600
0 కామెంట్‌లు