Ticker

6/recent/ticker-posts

Ad Code

కదులుతున్న Bus లో మహిళపై రేప్‌ !


హైదరాబాద్‌, జూలై 30 

హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. కదులుతున్న బస్సులోనే మరో డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మేడ్చల్‌ సవిూపంలో బస్‌ ఉండగా..బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ మహిళ డయల్‌ 100కు కాల్‌ చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బస్సును ఛేజ్‌ చేశారు.ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే పోలీసులు బస్సును చేజ్‌ చేసి పట్టుకున్నారు. నిందితుడు, డ్రైవర్‌ కృష్ణ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. అయితే మరో డ్రైవర్‌ సిద్ధయ్యను పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, హరికృష్ణ ట్రావెల్స్‌కు సంబంధించిన స్లీపర్‌ కోచ్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ప్రస్తుతం బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు  తెలియజేయనున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు