హైదరాబాద్ జులై 4 (ఇయ్యాల తెలంగాణ ):దళిత సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను అవమానించి ఆయన ఆత్మహత్యాయత్నాని కారణమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాల సంఘాల జేఏసీ చైర్మన్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి అకారణంగా మాల సామాజిక వర్గానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పై పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎదురుగా అవమానించారని వారు ఆరోపించారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కోరారు.ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి పై గతంలో అవినీతి ఆరోపణలు కారణంగా సస్పెన్షన్కు గురయ్యారని వారు గుర్తు చేశారు. రాజకీయ పలుకుబడితో విధుల్లోకి తిరిగి మల్లి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ పై దుర్భాషలాడాలని వారన్నారు. సీఐపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేసి విధులనుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు
0 కామెంట్‌లు