Ticker

6/recent/ticker-posts

Ad Code

కొండాకు BJP విప్‌ !


హైదరాబాద్‌, జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ అధ్యక్షుడ్ని ప్రకటించబోతోంది బీజేపీ హైకమాండ్‌. బలమైన సామాజిక వర్గాల నుంచి ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటోంది. ఈ క్రమంలో కులాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులోభాగంగానే తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికవర్గంపై కన్నేసిందితెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ ఫోకస్‌ చేసింది. నెక్ట్స్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అగ్రకులాలపై కన్నేసింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రెడ్డి సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని, లేకుంటే కష్టమన్నది బీజేపీ పెద్దలకు క్లియర్‌గా అర్థమైంది. ఈ క్రమంలో ఆ వర్గానికి కేంద్రంలో ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.ఇప్పటికే సీనియర్‌ నేత కిషన్‌రెడ్డిని మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన బండి సంజయ్‌కు సైతం మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక చేవెళ్ల ఎంపీగా గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి బీజేపీ హైకమాండ్‌ కీలక బాధ్యతలు అప్పగించింది. లోక్‌సభలో ఆ పార్టీ విప్‌గా నియమించింది. దీంతో తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీకి తాము ప్రయార్టీ ఇస్తున్నామనే సంకేతాలు కేడర్‌కి  పంపినట్లైంది. తెలంగాణ అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్‌ ఉన్నారు.కొండాకు విప్‌ పదవి ఇచ్చారుమొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటినుంచి బీజేపీ రూట్‌క్లియర్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీలో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు