నిరుద్యోగ Yuvata స్వయం ఉపాధి మార్గాలను కూడా ఎంచుకోవాలి..
బుధవారం, జూన్ 19, 2024
0
ఆళ్లగడ్డ, జూన్ 19 (ఇయ్యాల తెలంగాణ) : నిరుద్యోగ యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి మార్గాల వైపు కూడా దృష్టి సారించాలని ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు చింతకుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలో కొందరు నిరుద్యోగులు స్థాపించిన ఆటోమొబైల్స్ దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన భాషా, షరీఫ్, రసూల్ రఫీ తదితర యువత తమ కాళ్ళ విూద తాము నిలబడుతూ ఆటోమొబైల్స్ దుకాణాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో గర్వకారణమన్నారు.ఈ యువతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకున్న వారికి టీడీపీ ప్రభుత్వం కూడా అండగా నిలుస్తుందని.. నిరుద్యోగులకు రుణాలు ఇచ్చి వారిని స్వయం ఉపాధి మార్గాల వైపు నడిపించేందుకు పలు బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఆటోమొబైల్స్ వాటర్ వాష్ ప్లాంట్ లను ఏర్పాటు చేసిన యువకులను టిడిపి నేత శ్రీనివాస రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో శిల్పి సంజీవ, శిల్పి శివ తదితరులు పాల్గొన్నారు.
Tags