బద్వేల్లో మరి ఎక్కువ - తక్కువ ఖర్చు అవుతుందని వాహనదారుల మక్కువ
బద్వేలు, జూన్ 20 (ఇయ్యాల తెలంగాణ) : రవాణా వాహనాలకు ప్రతి సంవత్సరం సామర్ధ్య పరీక్షలు ( ఫిట్నెస్ సర్టిఫికెట్` ఎఫ్ సి) తప్పనిసరి. వెహికల్ కండిషన్ చూసి రవాణా శాఖ అధికారులు ఎఫ్ సి చేస్తారు ఆ సమయంలో అన్ని పత్రాలు ఉండాలి వాటిలో బీమా తప్పనిసరి కార్లకు మూడు సంవత్సరాలు ద్విచక్ర వాహనానికి ఐదు సంవత్సరాలు అద్దె వాహనాలకు ప్రతి సంవత్సరం బీమా చేయించుకోవాలి ఒక లారీకి 40 వేల నుంచి 50 వేల రూపాయలు అలాగే ఆటోకు 8000 రూపాయలు ఖర్చు అవుతుంది కొంతమంది వెహికల్ డ్రైవర్లు అంత మొత్తం కట్టలేక వేయి రూపాయలు 2000 రూపాయలు చెల్లించి ఏజెంట్ల వద్ద నకిలీ బీమా పత్రం తీసుకుని వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అధికారులు కూడా వాటిపై ఇచ్చిన తేదీ గడువు ఉందా అని చూసి ఓకే చేస్తున్నారు కొద్ది రోజులకు ఏదైనా ప్రమాదంలో వెహికల్ డ్రైవర్ చనిపోతే అప్పుడు బీమా కింద నయా పైసా కూడా రాదు దీంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి కడప జిల్లాలో కొంత కాలం నుంచి నకిలీ బీమా పత్రాలు వెలుగులోకి వస్తున్నాయి.
బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలానికి చెందిన ఒక మహిళ నకిలీ బీమా పత్రం పెట్టి తన వాహనానికి ఎఫ్ సి చేయించుకున్నారు బద్వేలు రవాణా శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు అలాగే కడప నగరానికి చెందిన ఆటో డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు అతని కుటుంబ సభ్యులు ప్రమాద బీమాకు దరఖాస్తు చేసుకున్నారు బీమా కంపెనీ అధికారులు వచ్చి ఆటోకు సంబంధించిన పత్రాలు పరిశీలించారు అతను అప్పటికే నకిలీ పత్రలతో ఎఫ్ సి చేయించుకోవడం జరిగింది దీంతో ఆ కుటుంబానికి నయా పైసా కూడా రాలేదు ఇలాంటివి చాలా ఉన్నాయి ముఖ్యంగా బద్వేల్ పట్టణంలో ఒక వ్యక్తి నకిలీ బీమా పత్రాలు చేస్తున్నట్లు సమాచారం ఎంతోకాలంగా ఈ వ్యవహారం నడుస్తుంది కడప జిల్లాలో గత కొంతకాలంగా నకిలీ బీమా పత్రాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది కడప బద్వేలు పులివెందుల ప్రొద్దుటూరు రవాణా శాఖ కార్యాలయాల వద్ద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దళారులు నకిలీ బీమా పత్రాలు తయారు చేస్తున్నారు ఇలాంటివి ప్రతిరోజు అయిదారు వస్తున్నాయి అవి చూడ్డానికి ఒరిజినల్ పత్రం లాగే ఉంటాయి దీంతో అధికారులు గుర్తించడం కష్టంగా మారింది అనుమానం ఉండి బార్కోడు తనిఖీ చేస్తే తప్ప గుర్తించలేక పోతున్నారు రవాణా శాఖ అధికారులు అన్నింటిని బార్కోడ్ తో తనిఖీ చేయాలంటే సాధ్యం కాదు
దీంతో కొంతమంది దళారులు అధికారుల కళ్ళు కప్పి నకిలీలు పెట్టి పనులు చేయించుకుంటున్నారు అటు పోలీసు శాఖ ఇటు రవాణా శాఖ అధికారులు నకిలీ ఎఫ్సీలపై స్పెషల్ డ్రైవ్ చేపడితే దీనికి కొంతవరకైనా అడ్డుకట్ట పడుతుంది లేకుంటే వెహికల్ దారులు తీవ్రంగా నష్టపోతారు