హైదరాబాద్ జూన్ 19 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.2023`24 సం.కి గాను 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగింది. 2023`24 సం.కి గాను ఆయిల్ పామ్ సాగు పధకం (ఔఓఇూ`ూఖ) కింద, కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లను విడుదల చేయడం జరిగింది. దీనికి రూ.53.40 కోట్ల రాష్ట్ర వాటా కలుపుకుని మొత్తం రూ.133.50 కోట్లు విడుదల చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తంలో 2023`24 సం.లో కేవలం రూ.32.72 కోట్లు మాత్రమే విడుదల చేయగా, వివిధ కారణాల చేత రూ.100.76 కోట్లు పెండిరగ్ లో పెట్టడం జరిగింది. దీని వలన ఉద్యాన శాఖ, రైతులకు మరియు ఆయిల్ పామ్/ డ్రిప్ కంపెనీలకు, సకాలంలో బకాయిలు విడుదల చేయడం వీలుపడలేదు.చొరవతో, గౌ.ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి ఆయిల్ పామ్ రైతుల మరియు కంపెనీల ఇబ్బందులను తీసుకురాగ, పెండిరగ్ లో వున్న రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని 2`3 రోజులలో ఆయిల్ పామ్ తోటల నిర్వహణ మరియు అంతర పంటల సాగుకు సంబందించిన రాయితీలను, రైతుల ఖాతాలలో జమ చేయుటకు ఉద్యానశాఖ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.
ఇదే విధంగా, 2022`23 సం. నుండి విడుదల కావలసివున్న సూక్ష్మ సేద్యానికి సంబందించి, రూ.55.36 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని అయిల్ పామ్ మరియు ఇతర పంటలలో డ్రిప్ పరికరాలను రైతు పంట పొలంలో అమర్చిన సూక్ష్మ సేద్య కంపనీలకు పెండిరగ్ లో ఊన్న బకాయిలుగాను విడుదల చేయడం జరిగింది. బకాయిలు విడుదలైనందువలన 2024`25 సంవత్సరానికి గాను నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకొనేవిధంగా రైతులను ఆయిల్ పామ్ చేపట్టుటకు ప్రొత్సహించవలసిందిగా ఉద్యాన అధికారులను మంత్రి ఆదేశించడం జరిగింది.