హైదరాబాద్, జూన్ 18, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా`డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TS PGECET `2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 18న సాయంత్రం 4 గంటలకు కూకట్పల్లిలోని జేఎన్టీయూ`హైదరాబాద్ హెచ్గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు పొందవచ్చు.
TS PGECET `2024 ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి...
👉 పీజీఈసెట్ ర్యాంకు కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి` pgecet.tsche.ac.in,
👉అక్కడ హోంపేజీలో కనిపించే ‘ఆనీలినిశ్రీనీజీట ఖీజీనిస అజీతీట’ అనే లింక్ విూద క్లిక్ చేయాలి.
👉 అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ‘పతివలి ఖీజీనిస అజీతీట’ బటన్ విూద క్లిక్ చేయాలి.
👉 వివరాలు నమోదుచేయగానే ఐసెట్ ర్యాంక్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ విూద దర్శనమిస్తుంది.
👉 అభ్యర్థులు ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.