👉 చెట్టుకొమ్మలు విరిగి పడితే వెంటనే తొలగిస్తాం.
👉 ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం .
👉 ఎక్కడ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకొస్తాలే వెంటనే పరిష్కరిస్తాం.
👉 ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ప్రయాణించండి.
సికింద్రాబాద్, జూన్ 13 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్ జోన్ పరిధిలో వర్షపు నీరు నిలువ కుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సికింద్రాబాద్ జోనల్ కమీషనర్ రవి కిరణ్ అన్నారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో వర్షపు నీరు నిల్వ ఉండే 17 స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. వాటి వద్ద వర్షపు నీరు నిల్వకుండా నిలిచిన వెంటనే వాటిని తొలగించుటకు ట్రాఫిక్ పోలీసుల సమన్వాయంతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన 17 పాయింట్లను జోనల్ కమిషనర్ రవి కిరణ్ పర్యవేక్షించి ట్రాఫిక్ పోలీసులతో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ రవి కిరణ్ మాట్లాడుతూ నార్త్ జోన్ పరిధిలో ఎక్కడ వర్షపు నీరు నిలిచిన, చెట్ల కొమ్మలు రోడ్లపై ఉన్న వాటిని వెంటనే తొలగించడం జరుగుతుందని ఒకవేళ తమ దృష్టికి రాని సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా అధికారులు దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని తొలగించి సమస్యను పరిష్కరిస్తామని ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసి సిబ్బంది Control Room No.040- 2111111