హైదరాబాద్, జూన్ 23 (ఇయ్యాల తెలంగాణ) : సోమాజిగూడ లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ D.R.రాధా రుక్మిణి ఆమె భర్త మోహన్ దంపతులను శనివారం ఘనంగా సన్మానించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ డాక్టర్ బి. విద్యుల్లత తెలంగాణ మిడ్ వైఫ్ నర్సింగ్ కౌన్సిల్, రిజిస్ట్రార్ B.విద్యావతి, ప్రస్తుత సోమాజిగూడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ G. పద్మ, ముదిరాజ్ మహాసభ నాయకులు సదానంద్, చెన్నయ్య, పి. వెంకటేష్ ముదిరాజ్, సురేందర్, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సుగా కెరీర్ ప్రారంభించి, 13 ఏళ్లు క్లినికల్ విభాగంలో, 26 ఏళ్లు టీచింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదోన్నతి పొందిన రాధా రుక్మిణి అందరి ఆదరాభిమానం పొందారని అన్నారు. విశాఖ పట్టణం, హైదరాబాద్, సిరిసిల్ల, సికింద్రాబాద్ లలోని నర్సింగ్ కళాశాలల్లో పనిచేసిన రాధ రుక్మిణి ఎందరో విద్యార్థులను ఉత్తమ నర్సులుగా తయారు చేశారని తెలిపారు. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ, మరోవైపు ఉద్యోగ బాధ్యతలను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
రిటైర్డ్ ప్రిన్సిపాల్ Professor పదవీ విరమణ సన్మాన సభ
ఆదివారం, జూన్ 23, 2024
0

Tags