విధులలో భాగముగా మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ
మహబూబాబాద్, జులై 17 (ఇయ్యాల తెలంగాణ) : పోలీస్ స్టేషన్ కు పుట్టెడు కష్టంతో న్యాయం చేయమని వచ్చిన వారికీ న్యాయం తో పాటు ప్రేమగా అక్కున చేర్చుకొని మేమున్నామంటూ ధైర్యం నింపి భరోసా కల్పించడం లో మహబూబాబాద్ జిల్లా పోలీసులు ముందుంటారు.అందుకు ఉదాహరణ నేడు నర్సింహుళపేట పోలీస్ స్టేషన్ లో జగిరిన సంఘటన. శాంతి భద్రతలు పరిరక్షించి ప్రజలకు సేవ చేయడమే కాదు ప్రేమగా అక్కున చేర్చుకొని గాయపడిన శరీరానికి ప్రధమ చికిత్స చేయడం కూడా తెలుసు అని నిరూపించిన మహబూబాబాద్ జిల్లా నర్సింహుళ పేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ . జాటోత్ పూల్ సింగ్ తండ్రి బగ్న 60 సంవత్సరాలు నివాసం వస్రం తండా గ్రామం, నర్సింహుల పేట మండలం అనే వ్యక్తి తన పొలం హద్దు విషయం లో ఒక వ్యక్తితో గొడవ జరిగి కాలు కి గాయమై నర్సింహులపేట పోలీస్ స్టేషన్ కు న్యాయం చేయమని ఫిర్యాదు ఇవ్వడానికి రాగ కాలుకి గాయం అయ్యి రక్తస్రవం అవుతున్న వ్యక్తిని గమనించిన హెడ్ కాన్స్టేబుల్ కృష్ణ పోలీస్ స్టేషన్ లో అందుబాటులో ఉన్న మెడికల్ కిట్ నుండి గయానికి కావాల్సినవి తీసి బాధితునికి వెంటనే ప్రధమ చికిత్స చేసి ఫిర్యాదు స్వీకరించి ధైర్యం చెప్పి హాస్పిటల్ కు పంపించడం జరిగింది. కృష్ణ చేసిన పనిని చూసి నర్సింహుళపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్.ఐ సత్తిష్ అభినందించారు.