న్యూ ఢిల్లీ, జూన్ 13, (ఇయ్యాల తెలంగాణ) : నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నీట్ కౌన్సిలింగ్ నిలిపివేతకు గురువారం (జూన్ 13) నో చెప్పింది. ‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపం. వారికి మళ్లీ ఎగ్జామ్ జరిగితే అంతా సజావుగా మారుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదని’ సుప్రీం కోర్టు పేర్కొంది. నీట్ యూజీ పరీక్ష సమయంలో నష్టపోయిన సమయాన్ని భర్తీ చేయడానికి ‘గ్రేస్ మార్కులు’ పొందిన 1563 మంది అభ్యర్థుల ఫలితాలను సవిూక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీయే విచారణ సమయంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 నీట్ యూజీ అభ్యర్థుల స్కోర్‌కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుందని, ఆ ప్రకారంగా ఈ విద్యార్థులకు గ్రేస్ మార్కులు తొలగిస్తామని సుప్రీంకోర్టు కి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. వీరికి మరోసారి పరీక్ష రాసే అవకాశం కూడా కల్పిస్తామని వెల్లడిరచింది. జూన్ 23న పరీక్షలు నిర్వహించి, జూన్ 30లోపు ఫలితాలు ప్రకటిస్తామని ఎన్టీయే అత్యున్నత ధర్మాసనానికి తెలిపింది.కాగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పేపర్ లీక్ ఆరోపణలతో పాటు ఫలితాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. నీట్ ఎగ్జామ్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని స్పష్టం చేసింది. క్యాన్సిల్ చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటుందని, అలాగే కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టేకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షపై వస్తున్న ఆరోపణలకు సమాధానాలు కావాలని ఎన్టీయేను ధర్మాసనం ఆదేశించింది.
ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఔుం)కి నోటీసులు జారీ చేసింది.మే 5న నీట్ యూజీ`2024 ప్రవేశ పరీక్ష జరిగింది. అయితే మొదట జూన్ 14న ఫలితాలను వెల్లడిస్తామని చెప్పిన అధికారులు.. అంతకంటే ముందే జూన్ 4న రిజల్ట్ విడుదల అయ్యాయి. నీట్ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో పేపర్ లీకేజీ జరిగిందని, ఫలితాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలో కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై దాఖలైన పిటిషన్లపై జూన్ 13న విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెబ్‌కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది . ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఔుం)కి నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 6 నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జూన్ 12న ఇదే అంశంపై ఢల్లీి హైకోర్టులోనూ విచారణ జరిగింది. ఢల్లీి హైకోర్టు కూడా కౌన్సెలింగ్‌పై స్టేను నిరాకరిస్తూ..తదుపరి విచారణనకు జులై 5కి వాయిదావేసిన సంగతి తెలిసిందే.
ఆరుగురు టాపర్ల వివాదమే కారణం..
ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ `2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 4న వెల్లడిరచింది. ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. అందులోనూ హర్యానాలో ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఒకేసారి ఒకే కేంద్రం నుంచి ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని పిటిషన్లో పేర్కొన్నారు. పాండే పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై జూన్ 13న విచారణ సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
పేపర్ లీకైనట్లు కాదు ` ఎన్టీఏ డీజీ
నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో 63 అవకతవకలకు పాల్పడినట్లు తేలిందని ఎన్టీఏ డీజీ సుబోధ్ సింగ్ తెలిపారు. వారిలో 23 మందిని పరీక్ష సమయంలోనే డిబార్ చేశామన్నారు. మిగిలిన 40 మంది విద్యార్థుల ఫలితాలను హోల్డ్‌లో ఉంచామని ఆయన తెలిపారు. కేవలం కొంతమంది అవకతవకలకు పాల్పడినంత మాత్రానా పరీక్ష పేపర్ లీక్ అయినట్లు కాదని ఆయన స్పష్టంచేశారు. ఇలాంటి ఆరోపణల వల్ల నీట్ పరీక్ష విశ్వసనీయత ఏమాత్రం దెబ్బతినదని సుబోధ్‌సింగ్ అన్నారు.