న్యూఢిల్లీ, జూన్ 25, (ఇయ్యాల తెలంగాణ) : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జూలై 3 వరకు జరిగే ఈ సెషన్లో రెండో రోజు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల తొలి రోజే 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, డిరపుల్ యాదవ్ సహా 270 మంది ఎంపీలు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక సోమవారం రోజునే ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు పేరు ఖరారు కానుంది.లోక్‌సభ మాజీ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈమేరకు ఉదయం 11:30 లోక్‌సభ సెక్రటేరియట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఓం బిర్లా పార్లమెంట్ పీఎంవోలో జరుగుతున్న సమావేశం నుంచి బయటకు వచ్చారు. లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా పేరును ఎన్డీయే కూటమి ఖరారు చేసింది. కాసేపటి తర్వాత పార్లమెంటు హౌస్‌లోని ప్రధాని మోదీతో అమిత్ షా, జేపీ నడ్డా, ఓం బిర్లా సమావేశమయ్యారు. ఎన్డీయే నేతలతో కలిసి స్పీకర్ పదవి కోసం ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు.మరోవైపు విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇవ్వవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి నామినేషన్ కోసం నేతలంతా తరలివచ్చారు. నేతలంతా కలిసి నామినేషన్ పత్రాలు, ప్రతిపాదనలు దాఖలు చేయనున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లపై ఏకాభిప్రాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రముఖ ప్రతిపక్ష నేతలతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలతో ఆయన మాట్లాడారు.
బరిలో ఇండియా కూటమి అభ్యర్ధి
లోక్‌సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. ప్రతిపక్షాల స్పీకర్ అభ్యర్థిగా కె.సురేష్ బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎన్డీయే తరపున లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జూన్ 26న బుధవారం జరగనుంది. స్పీకర్ పదవికి ఎన్నికలు జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అధికార, విపక్షాల ఏకాభిప్రాయంతోనే స్పీకర్‌ను ఎన్నుకునేవారు. అయితే ఈసారి ఈ సంప్రదాయానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.అంతకుముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఫోన్లో మాట్లాడి స్పీకర్ పదవికి మద్దతు కోరారు. స్పీకర్ పదవికి విపక్షాలు మద్దతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, అయితే ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే దీనిపై రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి తరుఫున సురేష్‌ను బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.కె సురేష్ 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1989, 1991, 1996, 1999, 2009, 2014, 2019, 2024లో ఎంపీగా ఎన్నికయ్యారు. కే సురేష్ కేరళలోని మావెలిక్కర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అత్యంత అనుభవం ఉన్న ఎంపీ అయినప్పటికీ ప్రొటెం స్పీకర్‌గా ఎన్నిక కాకపోవడంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. 1989లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కె సురేష్ అక్టోబర్ 2012 నుండి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.
సంప్రదాయాలకు విరుద్ధం
ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభకు ఎన్నికైన ఎంపీలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అయితే స్పీకర్ ఎంపిక విషయంలో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. రెండోసారి ఓం బిర్లాను స్పీకర్ గా ఎంపిక చేసింది ఎన్డీయే కూటమి. అందుకు సంబంధించి ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అదే క్రమంలో ఇండియా కూటమి తరఫున సురేష్ చేత నామినేషన్ దాఖలు చేయించారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ఈరోజు తాము స్పీకర్ పదవికి సంబంధించి ప్రతిపాదనను అధికారులకు అందజేశామని, తమ వద్ద స్పీకర్?ను ఎన్నుకునేందుకు తగిన సంఖ్యాబలం ఉందన్నారు. అయినప్పటికీ ఇండియా కూటమి స్పీకర్ పదవికి నామినేషన్ వేయడం పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్దం అని తెలిపారు. స్పీకర్ ఎంపిక విషయంలో తమ పార్టీ నుంచి మంత్రులు రాజ్?నాథ్?సింగ్, అమిత్ షాలు ఇండియా కూటమి నేతలతో మాట్లాడారని చెప్పారు. ఇదే క్రమంలో స్పీకర్ పదవికి మద్దతు ఇవ్వాలంటే డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కేటాయించాలని వారు కోరినట్లు చెప్పారు. అయితే డిప్యూటీ స్పీకర్ అంశాన్ని ఇండియా కూటమి నేతలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఆ పదవిని నిర్ణయించినప్పుడు తిరిగి చర్చలు జరుపుతామని కేంద్రమంత్రి రాజ్?నాథ్ సింగ్ ఇండియా కూటమి నేతలతో చెప్పినట్లు ప్రహ్లాద్ జోషి వివరించారు. ఏది ఏమైనా పార్లమెంట్?లో స్పీకర్ ఎన్నికకు కావల్సిన సంఖ్యబలం తమవద్ద ఉందని ఇండియా కూటమి నేతలు తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని, లోక్ సభ స్పీకర్?ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మద్దతు ఇవ్వాలని తాను ప్రతిపక్ష నేతలను కోరుతున్నానన్నారు.