GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి !
సోమవారం, జూన్ 24, 2024
0
హైదరాబాద్ జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కూడా ఆయన కొనసాగనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదలచేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనకు జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు.చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యను బదిలీ చేశారు. ఆమెకు హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Tags