అడ్మిషను రద్దు చేసుకుంటే వారికి పూర్తి Fees ను వాపసు
సోమవారం, జూన్ 17, 2024
0
న్యూఢిల్లీ, జూన్ 17 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఉన్నత విద్యాసంస్థల్లో తమ అడ్మిషను రద్దు చేసుకుంటే వారికి పూర్తి ఫీజును వాపసు ఇవ్వాలని విశ్వవిద్యాలయాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆదేశించింది. అడ్మిషన్ల చివరి తేదీకి 15 రోజులు, అంత కన్నా ముందే అడ్మిషన్‌ను రద్దు చేసుకుంటే 100 శాతం ఫీజు రిఫండ్ ఇచ్చేలా కొత్త నిబంధనలు జారీ చేసింది. 2024`25 విద్యాసంవత్సరం నుంచే ఈ కొత్త ఫీజు రిఫండ్ పాలసీని అమలు చేయాలని వర్సిటీలను ఆదేశించింది.
Tags